న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్కూల్ పిల్లాడి మాదిరి: స్టీవ్ స్మిత్‌ను ఎవరైనా ఇలా రనౌట్ చేస్తారా? (వీడియో)

Steve Smith Survives Run Out, Sri Lanka Bowler Forgets To Touch Stumps With Ball ! || Oneindia
WATCH- Lakshan Sandakans school boy error helps Steve Smith survive an easy run out

హైదరాబాద్: శ్రీలంక స్పిన్నర్ లక్షణ్‌ సందకన్‌‌కు రనౌట్ రూల్స్ తెలిసినట్టు లేవు. దీంతో స్కూల్ బాయ్ మాదిరి ప్రవర్తించాడు. ఒత్తిడికిలోనై ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను రనౌట్ చేసే గొల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకున్నాడు. ఈ సంఘటన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే....

సందకన్‌ బౌలింగ్‌లో వార్నర్‌ షాట్ ఆడాడు. అయితే, బంతి నేరుగా వికెట్లకు తాకి బెయిల్స్‌ కిందపడ్డాయి. అదే సమయంలో అవతల ఎండ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో క్రీజు వదలి సగం పిచ్ వరకు పరుగెత్తాడు. దీంతో సందకన్ వెంటనే బంతిని అందుకున్నాడు.

కంగారులో వికెట్ల గిరాటేయడం మరచిపోయి కుడిచేతిలో బంతిని ఉంచి ఎడమచేతితో స్టంప్‌ను పైకి తీశాడు. దీంతో స్మిత్‌ ఔట్ కాస్త నాటౌట్ అయింది. ఐసీసీ నిబంధనల ప్రకారం బెయిల్స్‌ పడిన సందర్భంలో బ్యాట్స్‌మన్‌ను రనౌట్‌ చేయాలంటే బంతితో మరోసారి వికెట్లను పడగొట్టాలి.

బంతిని ఒక చేతిలో ఉంచుకుని

బంతిని ఒక చేతిలో ఉంచుకుని

కానీ, సందకన్ అందుకు భిన్నంగా బంతిని ఒక చేతిలో ఉంచుకుని మరొక చేతితో స్టంప్‌ను పైకి లేపాడు. దీంతో స్టీవ్ స్మిత్ రనౌట్ నుంచి బ్రతికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

మంచి ఛాన్స్‌ను మిస్‌ చేశాడు

మంచి ఛాన్స్‌ను మిస్‌ చేశాడు

"అయ్యో.. మంచి ఛాన్స్‌ను మిస్‌ చేశాడు!" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా... మరొక నెటిజన్ "ఒత్తిడికిలోనై గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకున్నాడు" అని కామెంట్ పెట్టాడు. కాగా, బ్రిస్బేన్ వేదికగా బుధవారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మరో మ్యాచ్ మిగిలుండగానే సిరిస్‌ కైవసం

మరో మ్యాచ్ మిగిలుండగానే సిరిస్‌ కైవసం

ఫలితంగా మూడు టీ20ల సిరిస్‌ల మరో మ్యాచ్ మిగిలుండగానే సిరిస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరిస్‌లో చివరిదైన మూడో టీ20 మెల్ బోర్నీ వేదికగా శుక్రవారం జరగనుంది. 118 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వార్నర్(60 నాటౌట్), స్మిత్(53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో మరో 42 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

హాఫ్ సెంచరీలతో రాణించిన స్మిత్, వార్నర్

లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను మలింగ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. ఓపెనర్ ఆరోన్ ఫించ్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి వార్నర్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 19 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక జట్టులో బ్యాట్స్‌మెన్‌ కుశాల్‌ పెరెరా (27), దనుష్క (21) మాత్రమే రెండంకెల స్కోరుని అందుకోగా మిగతా బ్యాట్స్‌మన్ పూర్తిగా నిరాశపరిచారు.

మెల్ బోర్నీ వేదికగా శుక్రవారం మూడో టీ20

ఆస్ట్రేలియా బౌలర్లలో బిల్లీ స్టాన్ లేక్, ప్యాట్ కమిన్స్‌, ఆస్టన్ ఆగర్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ సిరిస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి టీ20లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, October 31, 2019, 13:03 [IST]
Other articles published on Oct 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X