న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WATCH: తమ్ముడిని రక్షించేందుకు స్టంపింగ్ వదిలేసిన పాక్ క్రికెటర్(వీడియో)

WATCH: Kamran Akmals shocking stumping miss saves brother Umar Akmal during T10 League game

హైదరాబాద్: షార్జా వేదికగా జరుగుతున్న టీ10 లీగ్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ సీనియర్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే పాక్ జాతీయ జట్టుకు దూరమైన కమ్రాన్ అక్మల్ తాజాగా ఈ టోర్నీలో తన సోదరుడు ఉమర్ అక్మల్‌ను ఔట్ నుంచి కాపాడేందుకు స్టంపింగ్‌ను వదిలేశాడు.

సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ టీ10 లీగ్‌లో భాగంగా ఉమర్ అక్మల్ పంజాబీ లెజెండ్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా మరాఠ అరేబియన్స్‌ జట్టు తరుపున కమ్రాన్ అక్మల్ ఆడుతున్నాడు. టోర్నీలో భాగంగా శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

స్పిన్నర్ రషీద్ ఖాన్ విసిరిన బంతిని

స్పిన్నర్ రషీద్ ఖాన్ విసిరిన బంతిని

ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ రషీద్ ఖాన్ విసిరిన బంతిని ఉమర్ అక్మల్ క్రీజు వెలుపలికి వచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే, వైడ్‌గా వెళ్లిన బంతి అతనికి అందకుండా నేరుగా వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ చేతుల్లోకి వెళ్తున్నట్లు కనిపించింది. ఈజీగా అందుకోవాల్సిన బంతిని అతడు అందుకోలేకపోయాడు.

తన సోదరుడ్ని రక్షించేందుకు ఇలా చేసినట్లు

అంతేకాదు స్టంపింగ్‌‌‌‌ను సైతం వదిలేశాడు. కమ్రాన్ కావాలనే తన సోదరుడ్ని రక్షించేందుకు ఇలా చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే, ఆ తర్వాతి ఓవర్‌లో ఉమర్ అక్మల్(18 బంతుల్లో 31) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో పంజాబీ లెజెండ్స్ 43 పరుగుల తేడాతో నెగ్గింది.

 డకౌట్‌గా వెనుదిరిగిన కమ్రాన్ ఆక్మల్

డకౌట్‌గా వెనుదిరిగిన కమ్రాన్ ఆక్మల్

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబీ లెజెండ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 121 పరుగులు చేసింది. అనంతరం 122 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మరాఠ అరేబియన్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 78 పరుగులు చేసి ఓటమిపాలైంది. క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో కమ్రాన్ అక్మల్ డకౌట్‌గా వెనుదిరిగాడు.

Story first published: Saturday, November 24, 2018, 15:39 [IST]
Other articles published on Nov 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X