గుండెను బరువెక్కించే సన్నివేశం: స్మిత్ క్రికెట్ కిట్‌ను గ్యారేజీలో పెట్టిన తండ్రి

Posted By:
WATCH: Heart-wrenching moment as Steve Smiths father packs his cricket kit

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదం నుంచి ఉపశమం పొందేందుకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్వదేశాన్ని వదిలి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన ఘటనలో స్మిత్, వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించగా... బంతి ఆకారాన్ని మార్చేందుకు యత్నించిన బాన్ క్రాప్ట్‌కు 9 నెలలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

బాల్ టాంపరింగ్‌ ఘటనపై సిడ్నీలో మీడియా సమావేశం నిర్వహించి తాను నాయకుడిగా విఫలమయ్యానని, తనను క్షమించాల్సిందిగా కోరుతూ స్టీవ్ స్మిత్ కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాస్త ఉపశమనం పొందడానికి ఆసీస్‌ వదిలి యూఏఈ వెళ్లాడు.

దక్షిణాఫ్రికా నుంచి గురువారం ఆస్ట్రేలియాకు చేరుకున్న స్టీవ్ స్మిత్ సిడ్నీ విమానాశ్రయంలో తండ్రి పీటర్‌తో కలిసి మీడియా సమావేశానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ మీడియా సమావేశంలో స్టీవ్ స్మిత్ బోరున విలపించడం ఎంతోమందిని చలించేలా చేసింది.

అదే సమయంలో పక్కనే ఉన్న స్మిత్ తండ్రి పీటర్‌ ఆ బాధను భరిస్తూనే స్మిత్‌ భుజం తట్టి ఓదార్చాడు. ఈ సన్నివేశం అభిమానులను సైతం ఎంతో ఆవేదనకు గురి చేసింది. కాగా క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించడంతో స్మిత్‌ క్రికెట్‌ కిట్‌ను పీటర్‌ గ్యారేజీలో పెట్టేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్థానిక మీడియా పీటర్‌ను ఏం చేస్తున్నారు అని ప్రశ్నించగా... ఏడాది వరకు స్మిత్‌కు దీంతో పనిలేదు కదా అని సమాధానం ఇచ్చాడు. స్మిత్‌ ఇప్పుడు ఎలా ఉన్నాడు అని అడిగిన మరో ప్రశ్నకు 'బాగానే ఉన్నాడు' అని బదులిచ్చాడు.

కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించగా... బాన్‌క్రాప్ట్‌పై 9 నెలల పాటు నిషేధం విధించింది. దీంతో పాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది.

ఈ వివాదానికి సూత్రధారి అయిన డేవిడ్‌ వార్నర్‌ ఎన్నటికీ ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌ కాలేడని సీఏ స్పష్టం చేసింది. అయితే, కెప్టెన్సీ విషయంలో స్మిత్‌, బాన్‌క్రాఫ్ట్‌కు ఒకింత ఊరటనిచ్చింది. ఆస్ట్రేలియా కెప్టెన్సీని చేపట్టకుండా స్మిత్‌పై రెండేళ్ల నిషేధం విధించింది. ఈ రెండేళ్ల కాలంలో దేశీయ, అంతర్జాతీయ మ్యాచుల్లో వీరు కెప్టెన్సీ చేపట్టరాదని పేర్కొంది.

క్రికెట్‌ అభిమానుల నుంచి, అధికారుల నుంచి అనుమతి, ఆమోదం ఉంటే జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టవచ్చునని పేర్కొంది. క్రికెట్‌తో సంబంధాలు పూర్తిగా తెగిపోకుండా వీరు క్లబ్‌ క్రికెట్‌ ఆడుకునేందుకు అనుమతించింది. మరోవైపు బాల్ టాంపరింగ్ వివాదంలో హెడ్ కోచ్ డారెన్ లీమన్ పాత్ర లేదని క్రికెట్ ఆస్ట్రేలియా క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికీ, కోచ్ పదవికి డారెన్ లీమన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Saturday, March 31, 2018, 16:01 [IST]
Other articles published on Mar 31, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి