కొంచెం ఉంటే పైకి పోయేవాడే: రాకాసి బౌన్సర్‌కు క్రీజులోనే కుప్పకూలిన మ్యాక్స్‌వెల్ (వీడియో)

Glenn Maxwell Saves Himself From Nasty Beamer ! || Oneindia Telugu

హైదరాబాద్: గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని. మ్యాక్స్‌వెల్ అంటేనే విధ్వంసకర ఇన్నింగ్స్‌కు పెట్టింది పేరు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించడం మ్యాక్స్‌వెల్ స్పెషాలిటీ. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను అలవోకగా ఎదుర్కొని బంతిని బౌండరీ దాటిస్తుంటాడు.

అలాంటి మ్యాక్స్ వెల్‌ను ఓ రాకాసి బంతి అమాంతం పైకి పంపించబోయింది. అయితే, ఈ ప్రమాదం నుంచి మ్యాక్స్‌వెల్ తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మెల్ బోర్న్ స్టార్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు.

లబుషేన్‌ లాంటి ఆటగాడు ప్రతి జట్టులో ఉండాలి: స్టీవ్‌ స్మిత్‌

సోమవారం మ్యాక్స్‌వెల్‌కు కలిసి రాలేదు

సోమవారం మ్యాక్స్‌వెల్‌కు కలిసి రాలేదు

టోర్నీలో భాగంగా సోమవారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్ అటు మ్యాక్స్‌వెల్‌కే కాదు అతడి జట్టుకు కూడా ఎంతమాత్రం కలిసి రాలేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్న మెల్‌బోర్న్ స్టార్స్ ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో తొమ్మిదో విజయానికి బ్రేక్ పడింది.

క్రూరమైన బౌన్సర్‌ను ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్‌

క్రూరమైన బౌన్సర్‌ను ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్‌

ఇక, ఈ మ్యాచ్‌ సందర్భంగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ సిడ్నీ సిక్సర్స్ బౌలర్ బెన్ ద్వార్షుయిస్ వేసిన ఓ క్రూరమైన బౌన్సర్‌ను ఎదుర్కొన్నాడు. ఈ బౌన్సర్ దాదాపుగా అతడి తలను తాకింది. దీంతో మ్యాక్స్‌వెల్ ఒక్కసారి క్రీజులోనే కుప్పుకూలాడు. అయితే, అతడికి ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగింది?

సిక్సర్స్ బౌలర్ బెన్ ద్వార్షుయిస్ వేసిన బౌన్సర్‌ను హిట్ చేసేందుకు మ్యాక్స్‌వెల్ ప్రయత్నించాడు. అయితే, బంతి అతడి బ్యాట్ లోపలి అంచుని తాకి అమాంతం భుజాన్ని తాకింది. దీంతో మ్యాక్స్‌వెల్ క్రీజులోనే కిందపడిపోయాడు. ఆ డెలివరీని సంధించిన బెన్ ద్వార్షుయిస్ సైతం అమాంతం పరిగెత్తుకుంటూ మ్యాక్స్‌వెల్ వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పాడు.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, ఈ బౌన్సర్‌ని అంఫైర్ నో బాల్‌గా ప్రకటించడం... ప్రీ హిట్ లభించింది. దీంతో ఆ తర్వాత బంతిని మ్యాక్స్‌వెల్ ఫోర్‌గా మలిచాడు. అంతకముందు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌ని 14 ఓవర్లకు కుదించారు.

మెల్‌బోర్న్ స్టార్స్ ఓటమి

దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. సిడ్నీ సిక్సర్స్ జట్టులో మెయిసిస్ హెన్రీక్యూస్ 31 బంతుల్లో 72 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్ బోర్న్ స్టార్స్ 14 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.

మార్కస్ స్టోయినిస్ హాఫ్ సెంచరీ

మార్కస్ స్టోయినిస్ హాఫ్ సెంచరీ

ఓపెనర్ మార్కస్ స్టోయినిస్ హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ జట్టుని గెలిపించలేకపోయాడు. లీగ్‌లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన మెల్ బోర్న్ స్టార్స్ ఈ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. అయినా సరే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్‌లో మెల్ బోర్న్ స్టార్స్ తన తదుపరి మ్యాచ్‌ని బుధవారం ఆడనుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, January 21, 2020, 15:57 [IST]
Other articles published on Jan 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X