న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుసగా రెండో ఫోర్లు: చిరాకుతో లుంగి ఎంగిడి ఎంత పనిచేశాడో చూడండి (వీడియో)

ICC Criket World Cup 2019 : SA VS BAN : Tamim Iqbal defends wild throw from Lungi Ngidi
Watch: Frustrated Lungi Ngidi Nearly Hits Tamim Iqbal With His Throw

హైదరాబాద్: తన ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడన్న చిరాకుతో బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉన్నప్పటికీ నేరుగా వికెట్ల మీదకు త్రో విసిరాడు సఫారీ పేసర్ లుంగి ఎంగిడి. వరల్డ్‌కప్ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కొత్త బంతిని అందుకున్న లుంగి ఎండిగి ఆశించిన మేరకు సత్తా చాటలేకపోయాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీలు బంగ్లాదేశ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. దీంతో లుంగి ఎంగిడి వేసిన తొలి ఓవర్‌లో 5 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత రెండో ఓవర్‌లో రెండు పరుగులు ఇచ్చాడు. ఇక, మూడో ఓవర్‌లో సౌమ్య సర్కార్ మూడు ఫోర్లు బాదడంతో 14 పరుగులు సమర్పించుకున్నాడు.

వరుసగా రెండో ఫోర్లు

వరుసగా రెండో ఫోర్లు

ఇక, ఎంగిడి వేసిన నాలుగో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన సౌమ్య సర్కార్ ఆ తర్వాత బంతికి సింగిల్ తీసి తమీమ్ ఇక్బాల్‌కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. దీంతో స్ట్రైకింగ్ ఎండ్‌లో తమీమ్ ఇక్బాల్ ఉండగా... నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో సౌమ్య సర్కార్ ఉన్నాడు. ఎంగిడి వేసిన నాలుగో బంతిని తమీమ్ ఇక్బాల్ డిఫెన్స్ ఆడాడు.

వికెట్లపైకి బంతిని విసిరిన ఎంగిడి

దీంతో పరుగులేమీ లభించలేదు. అయితే, తమీక్ ఇక్బాల్ ఆడి బంతి నేరుగా లుంగి ఎంగిడి చేతికి అందడం... అంతకముందు సౌమ్య సర్కార్ వరుసగా రెండు ఫోర్లు బాదిన చిరాకులో ఉన్న ఎంగిడి... తమీమ్ ఇక్బాల్ క్రీజులో ఉన్నప్పటికీ బంతిని వికెట్లపైకి విసిరాడు. ఈ క్రమంలో వికెట్ల పైకి బంతి వస్తుండటాన్ని గమనించిన ఇక్బాల్ బ్యాట్‌తో అడ్డుకున్నాడు.

గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం

గాయం కారణంగా మ్యాచ్‌కు దూరం

అనంతరం లుంగి ఎంగిడిని ఏంటిది! అంటూ ప్రశ్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత, లుంగి ఎంగిడి మోకాలి గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసే వరకు మైదానానికి తిరిగి రాలేదు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.

21 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి

21 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీమ్‌ (80 బంతుల్లో 78), షకీబ్‌ అల్‌ హసన్‌ (84 బంతుల్లో 75; 8 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం 331 పరుగుల లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 309 పరుగులు చేసి ఓడిపోయింది. టోర్నీలో సఫారీలకు వరుసగా ఇది రెండో ఓటమి.

Story first published: Monday, June 3, 2019, 13:22 [IST]
Other articles published on Jun 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X