న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చేతిలో బ్యాట్ పెట్టేసి వెళ్లాడు: బుల్లి ఫ్యాన్‌ని ఆశ్చర్యానికి లోను చేసిన వార్నర్ (వీడియో)

 Watch: David Warner Makes Young Fans Day With Brilliant Gesture

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ నిషేధం తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా పరిణితిని ప్రదర్శిస్తున్నాడు. డేవిడ్ వార్నర్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇందుకేనేమో వార్నర్‌కు చిన్నారులంటే ఎంతో ఇష్టం. మైదానం వెలుపల, బయట తనకు తారసపడే బుల్లి అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇస్తూనే ఉంటాడు.

తాజాగా సిడ్నీ వేదికగా న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు ఆఖరి రోజున ఓ చిన్నారి అభిమానికి ఓ సర్‌ప్రైజ్‌ గిప్ట్ ఇచ్చి అతడిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అసలేం జరిగిందంటే.... మ్యాచ్‌ ఆరంభానికి ముందు వార్నర్‌ మైదానంలో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళుతున్నాడు.

<strong>ఇంతటి సునాయాస క్యాచ్‌ను చిన్న పిల్లాడు కూడా వదిలేయడు (వీడియో)!!</strong>ఇంతటి సునాయాస క్యాచ్‌ను చిన్న పిల్లాడు కూడా వదిలేయడు (వీడియో)!!

వార్నర్ బ్యాట్ అందుకున్న అభిమాని

వార్నర్ బ్యాట్ అందుకున్న అభిమాని

ఆ సమయంలో పెవిలియన్ వద్ద తననే తదేకంగా చూస్తున్న ఓ అభిమానికి వార్నర్‌ తన బ్యాట్‌ను బహుకరించాడు. దీనిని ఊహించని ఆ చిన్నారికి కాసేపు ఏం జరిగిందో అర్ధం కాలేదు. ఆ తర్వాత వార్నర్ తనకు బ్యాట్ బహుకరించాడని తెలుసుకుని ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ "ఒక క్రికెట్ అభిమాని ఈ చిన్న వీడియోను తీసుకున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో డేవిడ్ వార్నర్ తర్వాతి తరానికి స్ఫూర్తినిచ్చేలా ప్రవర్తించాడు. టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వార్నర్ తన హెల్మెట్‌తో పాటు గ్లౌజులను పిల్లలకు ఇచ్చాడు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. బాగా చేసారు డేవ్" అని కామెంట్ పెట్టాడు.

బాల్‌ టాంపరింగ్ ఉదంతం తర్వాత

బాల్‌ టాంపరింగ్ ఉదంతం తర్వాత

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. బాల్‌ టాంపరింగ్ ఉదంతం తర్వాత డేవిడ్ వార్నర్‌ ఆటతో పాటు వ్యక్తిత్వంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన డేవిడ్ వార్నర్ నిషేధ సమయంలో ఓ ఇంటర్వ్యూలో కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే.

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం

సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా 279 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ సిరిస్‌లో ఆసీస్ క్లీన్ స్వీప్ చేయడంతో 296 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది.

Story first published: Tuesday, January 7, 2020, 14:54 [IST]
Other articles published on Jan 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X