న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సహనం కోల్పోయిన ధోని: ఖలీల్ అహ్మద్‌పై కోపడ్డాడు (వీడియో)

MS Dhoni Loses His Cool, Shouts At Khaleel Ahmed | Oneindia Telugu
WATCH: Captain Cool MS Dhoni shouts at Khaleel Ahmed for walking on the pitch in Adelaide

హైదరాబాద్: మైదానంలో ఎప్పుడూ కూల్‌గా ఉండే మహేంద్రసింగ్ ధోని... ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో ఓ క్షణం పాటు సహనాన్ని కోల్పోయాడు. డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చిన ఎక్స్‌స్ట్రా ప్లేయర్, టీమిండియా పేసర్ ఖలీల్ అహ్మద్‌పై కోప్పడ్డాడు.

<strong>ఖవాజా రనౌట్: ఒంటి చేత్తో స్టంప్స్‌ని గిరాటేసిన జడేజా (వీడియో)</strong>ఖవాజా రనౌట్: ఒంటి చేత్తో స్టంప్స్‌ని గిరాటేసిన జడేజా (వీడియో)

ఇందుకు సంబంధించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అడిలైడ్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోని ఫినిషింగ్‌ టచ్‌తో విజయం భారత్‌నే వరించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లలో షాన్‌ మార్ష్‌ (131; 123 బంతులు,11ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ, మాక్స్‌వెల్‌(48)లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆసీస్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించిన సంగతి తెలిసిందే.

31 బంతుల్లో 45 పరుగులు అవసరమైన దశలో

31 బంతుల్లో 45 పరుగులు అవసరమైన దశలో

జట్టు విజయానికి 31 బంతుల్లో 45 పరుగులు అవసరమైన దశలో అంపైర్లు డ్రింక్స్ బ్రేక్ ఇవ్వగా.. 12వ ఆటగాడిగా ఉన్న ఖలీల్ అహ్మద్, 13వ ఆటగాడిగా ఉన్న స్పిన్నర్ చాహల్.. బ్యాటింగ్ చేస్తున్న ధోని, దినేశ్ కార్తీక్‌కి డ్రింక్స్ అందించేందుకు మైదానంలోకి వచ్చారు. ఇక్కడే ఖలీల్ అహ్మద్ పొరపాటు చేశాడు.

డ్రింక్స్ అందించే ఉద్దేశంతో

ధోని, దినేశ్ కార్తీక్‌కి వేగంగా డ్రింక్స్ అందించే ఉద్దేశంతో ఖలీల్ అహ్మద్ పిచ్‌పై పరుగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో అతడిని వారించిన ధోని ఎక్కడ నడుస్తున్నావ్? పిచ్ పక్క నుంచి రావొచ్చు కదా? అంటూ కోప్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పరుగు తీసే సమయంలో పిచ్‌పై పరుగెత్తకూడదు

పరుగు తీసే సమయంలో పిచ్‌పై పరుగెత్తకూడదు

నిజానికి బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు కూడా పరుగు తీసే సమయంలో పిచ్‌పై పరుగెత్తకూడదు. ఒకవేళ బ్యాట్స్‌మెన్ అలా పరుగెత్తితే? తొలుత ఫీల్డ్ అంపైర్ హెచ్చరిస్తాడు. మళ్లీ అదే తప్పిదానికి పాల్పడితే? ఐదు పరుగులు అదనంగా ప్రత్యర్థి జట్టుకి కేటాయిస్తారు. పిచ్‌‌పై ఆటగాడు పరుగెత్తితే.. పాద ముద్రలతో.. ఆ పిచ్ క్రమంగా స్పిన్నర్లకి అనుకూలిస్తుంది కాబట్టి.

Story first published: Wednesday, January 16, 2019, 15:36 [IST]
Other articles published on Jan 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X