న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1000 పరుగులు: రంజీ సీజన్‌లో వసీం జాఫర్ సరికొత్త రికార్డు

Wasim Jaffer becomes the first batsman to score 1000 runs in a Ranji Trophy season twice

హైదరాబాద్: భారత దేశవాళీ దిగ్గజం, వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. విదర్భకు చెందిన 40 ఏళ్ల వసీం జాఫర్ ఒక రంజీ సీజన్‌లో రెండు సార్లు వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు.

ప్రస్తుతం కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో విదర్భ తరఫున ఆడుతున్న వసీం జాఫర్ తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు చేయడం ద్వారా ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు జాఫర్ 1003 పరుగులు చేశాడు.

జాఫర్ అత్యధిక స్కోరు 206

జాఫర్ అత్యధిక స్కోరు 206

అందులో నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో వసీం జాఫర్ అత్యధిక స్కోరు 206 పరుగులు కాగా యావరేజి 77.15గా ఉంది. 2008-09 రంజీ సీజన్‌లో కూడా ముంబై తరఫున ఆడిన వసీం జాఫర్ వెయ్యి పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో జాఫర్ 1260 పరుగులు చేశాడు.

40 ఏళ్లు పైబడిన

40 ఏళ్లు పైబడిన

గత వారంలో జాఫర్ 40 ఏళ్లు పైబడిన తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా, అదే విధంగా తొలి ఆసియా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 1996-97లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వసీం జాఫర్ ఇప్పటివరకు మొత్తం 251 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో యావరేజి 51.42తో 19 వేల పరుగులు చేశాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో

ఇందులో 57 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జాఫర్ అత్యధిక స్కోరు 314 పరుగులు. ఇక, భారత్ తరుపున వసీం జాఫర్ 2000 నుంచి 2008 వరకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం 31 టెస్టు మ్యాచ్‌లాడిన జాఫర్ 1,944 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి.

Story first published: Wednesday, September 16, 2020, 12:38 [IST]
Other articles published on Sep 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X