న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారీ సిక్స్ కొట్టినా.. బంతిని చూడని సుందర్! అచ్చం ధోనీలానే! (వీడియో)

Washington Sundar hits a no look Six against Nathan Lyon
Ind vs Aus 4th Test : Washington Sundar హిట్స్ Stunning 'No-Look' Six Off Nathan Lyon

బ్రిస్బేన్‌: గబ్బా స్టేడియంలో జరుగుతున్న నిర్ణయాత్మక నాలుగో టెస్టులో భారత్‌ ముందు ఆస్ట్రేలియా గట్టి సవాల్‌ విసిరింది. తొలి ఇన్నింగ్స్‌ 33 పరుగుల ఆదిక్యంతో కలిపి మొత్తంగా 328 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు టీమిండియా ముందుంచింది. అయితే ఇంకా ఒకరోజు ఆట మాత్రమే మిగిలి ఉండటం, ఆస్ట్రేలియా పేస్‌ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడం ఇప్పుడు రహానే సేన ముందున్న పరీక్ష. తొలి ఇన్నింగ్స్‌లో టాప్‌, మిడిల్‌ ఆర్డర్‌ విఫలమైనా.. లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ రాణించడంతో టీమిండియా పోటీలో ఉంది. లేదంటే.. ఇప్పుడున్న టార్గెట్‌ కంటే మరో 100 పరుగుల లక్ష్యం ముందుండేది. అప్పుడు పరిస్థితి మరోలా ఉండేది.

పైన్‌.. ఇదేందయ్యో ఇది! అందుకోసమే కాలితో షాట్ ఆడబోయావ్ కదా? (వీడియో)పైన్‌.. ఇదేందయ్యో ఇది! అందుకోసమే కాలితో షాట్ ఆడబోయావ్ కదా? (వీడియో)

సుందర్‌ హాఫ్ సెంచరీ

ఒక ద‌శ‌లో 186 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన టీమ్‌ను.. టీమిండియా ఆల్‌రౌండర్‌లు వాషింగ్టన్‌ సుందర్‌ (144 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్‌), శార్దూల్‌ ఠాకూర్‌ (115 బంతుల్లో 67; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నారు. ఇద్దరూ ఏడో వికెట్‌కు విలువైన 123 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఫలితంగా భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఇద్ద‌రూ ఆసీస్ బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి హాఫ్ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా తొలి టెస్ట్ ఆడుతున్న సుంద‌ర్.. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

మహీను గుర్తుచేశాడు

మహీను గుర్తుచేశాడు

వాషింగ్టన్‌ సుందర్‌ తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. హాఫ్ సెంచరీ అనంతరం స్పిన్నర్ నాథన్ లైయాన్ బౌలింగ్‌లో మిడ్-ఆన్ దిశగా భారీ సిక్స్ బాదాడు. అయితే సిక్స్ బాదిన అనంతరం సుందర్‌ బంతివైపే చూడలేదు. కచ్చితంగా సిక్స్ వెళుతుందనే నమ్మకంతో ఉన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా షాట్ ఆడిన అనంతరం బంతివైపు చూసేవాడు కాదు. అతని షాట్‌పై అంత నమ్మకంగా ఉండేవాడు. సుందర్ కూడా అచ్చు మహీలానే ధీమాగా ఉన్నాడు. సుందర్ సిక్సుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'మహీను గుర్తుచేశాడు', 'సుందర్ మాత్రమే కాదు.. ఆస్ట్రేలియన్లు కూడా చూడలేదు', 'ఆండ్రీ ఫ్లెచర్ గుర్తొచ్చాడు' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

110 ఏళ్ల రికార్డు బ‌ద్ధ‌లు

110 ఏళ్ల రికార్డు బ‌ద్ధ‌లు

ఆడిన తొలి టెస్ట్‌లోనే బ్యాట్‌తో ఆస్ట్రేలియాకు చుక్క‌లు చూపించిన వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఏకంగా 110 ఏళ్ల రికార్డును బ‌ద్ధ‌లు కొట్టాడు. సుందర్ చేసిన 62 ప‌రుగులు ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఓ స‌రికొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాలో ఆడిన తొలి టెస్ట్‌లోనే ఏడో నంబ‌ర్‌లో బ్యాటింగ్‌కు దిగి అత్య‌ధిక ప‌రుగులు చేసిన బ్యాట్స్‌మ‌న్‌గా నిలిచాడు. 1911లో ఇంగ్లండ్ త‌ర‌ఫున అరంగేట్రం చేసిన ఫ్రాంక్ పోస్ట‌ర్ 56 ప‌రుగుల రికార్డును సుంద‌ర్ అధిగ‌మించాడు.

మూడో ఇండియ‌న్‌గా

మూడో ఇండియ‌న్‌గా

భార‌త్ తర‌ఫున అరంగేట్ర టెస్ట్‌లో ఏడో నంబ‌ర్ బ్యాట్స్‌మ‌న్ చేసిన మూడో అత్య‌ధిక స్కోర్ కూడా వాషింగ్ట‌న్ సుంద‌ర్ చేసినవే. ఈ లిస్ట్‌లో రాహుల్ ద్ర‌విడ్ ముందున్నాడు. అత‌ను 1996లో ఇంగ్లండ్‌పై తొలి టెస్ట్‌లో ఏడో నంబ‌ర్‌లో దిగి 96 ప‌రుగులు చేశాడు. ఇక తొలి టెస్ట్‌లోనే మూడు వికెట్ల‌తో పాటు హాఫ్ సెంచ‌రీ చేసిన మూడో ఇండియ‌న్‌గా సుంద‌ర్ నిలిచాడు. అత‌ని కంటే ముందు ద‌త్తు ఫాడ్క‌ర్‌, హ‌నుమ విహారి ఈ ఘ‌న‌త సాధించారు.

Story first published: Monday, January 18, 2021, 15:52 [IST]
Other articles published on Jan 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X