న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలా చేస్తే ప్రయోజనం ఉండదు.. సత్తా చాటుకోవాలంటే అవకాశాలివ్వాలి

Shreyas Iyer Believes Getting In And Out Of Indian Side Doesn’t Create Good Pattern || Oneindia
Was difficult to not get selected for the World Cup, Getting in and out of the side isnt a good pattern feels Shreyas Iyer

ముంబై: ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం చాలా బాధించింది. భవిష్యత్తులో తప్పక ప్రపంచకప్‌లో ఆడతా అని టీమిండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు. జట్టులోకి వస్తూ పోతూ ఉంటే ప్రతి ఆటగాడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కుదురుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని శ్రేయస్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డాడు. భారత్‌-ఏ జట్టు తరఫున విండీస్‌ పర్యటనలో అద్భుతంగా రాణించడంతో.. ఆగస్టు 3 నుండి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టూర్‌ కోసం ప్రకటించిన భారత టీ20, వన్డే జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌ చోటు దక్కించుకున్నాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

 అవకాశాలు ఇవ్వాలి:

అవకాశాలు ఇవ్వాలి:

ఆదివారం శ్రేయస్‌ అయ్యర్‌ మీడియాతో మాట్లాడాడు. 'నిజంగా ప్రతిభావంతుడైన ఆటగాడు నిరూపించుకోవడానికి, పరిస్థితులకు అలవాటు పడటానికి తగినన్ని అవకాశాలివ్వాలి. ప్రతిసారి జట్టులోకి వస్తూ పోతూ ఉంటే ఆటగాడి ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. జట్టులోకి ఎంపిక కానప్పుడు కొన్నిసార్లు ఆటగాడు సహనం కోల్పోవచ్చు. కానీ.. ఎంపిక మన చేతుల్లో ఉండదు. మెరుగైన ప్రదర్శన చేయడం మాత్రమే ఆటగాడి చేతుల్లో ఉంటుంది' అని అయ్యర్‌ తెలిపాడు.

ఆటను ఆస్వాదిస్తూనే ఉండాలి:

ఆటను ఆస్వాదిస్తూనే ఉండాలి:

'పతి ఆటగాడు మెరుగైన ప్రదర్శన చేస్తూనే ఉండాలి. అత్యున్నత స్థాయి క్రికెట్‌ ఆడే సత్తా ఉందని చాటుకుంటూనే ఉండాలి. అప్పుడే సెలక్టర్లు మనను గుర్తిస్తారు. ఎప్పుడు కూడా ఆటను ఆస్వాదిస్తూనే ఉండాలి. తాను అలానే చేసా' అని అయ్యర్‌ చెప్పుకొచ్చాడు. 'భారత్‌ ఏ పర్యటన తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఉపయోగపడింది. విండీస్‌ పర్యటనలో రాణిస్తానని' ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్‌ తరఫున శ్రేయస్‌ అయ్యర్‌ 6 వన్డేలు, 6 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

ప్రపంచకప్‌లో ఆడతా:

ప్రపంచకప్‌లో ఆడతా:

'నిలకడగా రాణిస్తుండడంతో ప్రపంచకప్‌కు ముందు నాపై చర్చ జరిగింది. ఆ ప్రదర్శన భారత్‌కు ఆడేటప్పుడు తప్పక ఉపయోగపడుతుంది. ప్రపంచకప్‌కు ఎంపిక కావడం కష్టం. కానీ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కపోవడం బాధించింది. దేశం తరపున ప్రపంచకప్‌లో ఆడడం నా కల. నాకు కొన్ని అవకాశాలు ఉన్నాయని తెలుసు. కానీ.. దురదృష్టవశాత్తు ఆ జట్టు కూర్పులో నా అవసరం లేకపోయింది. భవిష్యత్తులో తప్పక ప్రపంచకప్‌లో ఆడతా' అని అయ్యర్‌ ధీమా వ్యక్తం చేసాడు.

Story first published: Monday, July 29, 2019, 14:41 [IST]
Other articles published on Jul 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X