న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షేన్ వార్న్‌ సమక్షంలో కుల్దీప్ ఐపీఎల్ అత్యుత్తమ గణాంకాలు

By Nageshwara Rao
Warnes presence motivated Kuldeep to register career-best IPL figures

హైదరాబాద్: ఐపీఎల్‌లో తాను అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడానికి ఆసీస్ మాజీ లెజెండ్ షేన్‌ వార్న్‌ కారణమని చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థి జట్లపై అంతగా ప్రభావం చూపింది లేదు.

ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచిన కుల్దీప్

ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచిన కుల్దీప్

బ్యాట్స్‌మెన్‌పై కనీసం ప్రభావం చూపించకుండా.. ధారళంగా పరుగులు సమర్పించుకుని జట్టులో ఓరకంగా తన చోటును ప్రశ్నార్థకం చేసుకున్నాడు. అయితే, ప్లే ఆఫ్స్ రేసులో నిలువాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేసి కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచాడు.

వార్న్ ముందు ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు

వార్న్ ముందు ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు

ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన కుల్దీప్ యాదవ్ 12 వికెట్లే తీశాడు. కానీ, రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగులకు నాలుగు వికెట్లు తీసి ఈ టోర్నీలో తన అత్యుత్తమ బౌలింగ్‌ చేశాడు. తాను ఎంతగానో అభిమానించే రాజస్థాన్ మెంటార్, దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ ముందు ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేయడం విశేషం.

షేన్‌వార్న్‌కు నేను పెద్ద అభిమానిని

మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన కుల్దీప్ మీడియాతో మాట్లాడుతూ 'షేన్‌వార్న్‌కు నేను పెద్ద అభిమానిని. అతడే నాకు ఆదర్శం. వార్న్‌ సమక్షంలో బౌలింగ్‌ చేసినప్పుడ ల్లా ఎంతో స్ఫూర్తి పొందుతా. ఎన్నోసార్లు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చాడు' అని కుల్దీప్ యాదవ్ వివరించాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత వార్న్‌తో మాట్లాడాను

'నిజానికి వార్న్ సమక్షంలో రాణించడం గర్వంగా అనిపిస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత వార్న్‌తో మాట్లాడాను. రానున్న ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాను. ఐపీఎల్ ముగిసిన తర్వాత సలహాలు, సూచనల కోసం వార్న్‌ను మళ్లీ కలిసే అవకాశముంది' అని కుల్దీప్ వెల్లడించాడు.

Story first published: Thursday, May 17, 2018, 9:27 [IST]
Other articles published on May 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X