న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

85 కోట్లు: రాజస్థాన్ రాయల్స్‌లో తన 3 శాతం వాటాను అమ్మేందుకు సిద్ధమైన షేన్ వార్న్

 Warne awaits big pay day for his small stake in Rajasthan Royals

హైదరాబాద్: రాజస్థాన్ రాయల్స్ జట్టులో తనకున్న 3 శాతం వాటాను అమ్మేందుకు ఆసీస్ లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ సిద్ధమయ్యాడు. 2008లో ఐపీఎల్ ఆరంభ సీజన్ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రపంచంలోనే క్యాష్ రిచ్ లీగ్‌ల్లో ఒకటిగా వెలుగొందుతుంది. నిజానికి లీగ్‌ ఆరంభమైనపుడు అది ఈ స్థాయికి చేరుతుందని ఎవ్వరూ ఊహించలేదు.

దీంతో ఐపీఎల్‌లో తమ జట్టుకు కెప్టెన్సీతో పాటు కోచ్‌ బాధ్యతలూ నిర్వర్తించడానికి సిద్ధమైన షేన్‌ వార్న్‌కు రాజస్థాన్ రాయల్స్‌ రూ.4.6 కోట్ల చొప్పున వార్షిక వేతనంతో పాటు ఫ్రాంఛైజీలో వాటా ఇచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఏడాదికి 0.75 శాతం వాటా ఇచ్చి, వార్న్‌ ఎన్నేళ్లు రాయల్స్‌కు ఆడితే అంత 0.75 శాతం కలిపేలా రాయల్స్ అప్పట్లో ఒప్పందం కుదుర్చుకుంది.

రష్యాకు ఊహించని షాకిచ్చిన వాడా: 4 ఏళ్ల నిషేధం, టోక్యో ఒలింపిక్స్‌కు దూరం!రష్యాకు ఊహించని షాకిచ్చిన వాడా: 4 ఏళ్ల నిషేధం, టోక్యో ఒలింపిక్స్‌కు దూరం!

ఈ క్రమంలో 2008 తర్వాత నాలుగు సీజన్లు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన షేన్ వార్న్ ఆ తర్వాత వీడ్కోలు పలికాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్‌లో షేన్ వార్న్ వాటా మొత్తం 3 శాతం అయింది. ప్రస్తుతం రాయల్స్‌ విలువ దాదాపు రూ.1425 కోట్లుగా ఉంది. ఇందులో 3 శాతం అంటే వార్న్‌ వాటా సుమారు రూ. 85 కోట్లు.

'బ్యాక్ ఫైర్' అవుతుందేమో!: ఆసీస్ పర్యటనలో టీమిండియా 2 డే నైట్ టెస్టులు ఆడటంపై చాపెల్'బ్యాక్ ఫైర్' అవుతుందేమో!: ఆసీస్ పర్యటనలో టీమిండియా 2 డే నైట్ టెస్టులు ఆడటంపై చాపెల్

తన వాటా మొత్తాన్ని ఇటీవలే షేన్ వార్న్ అమ్మబోతున్నట్లు సన్ హెరాల్డ్ పత్రికలో వార్త రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Story first published: Monday, December 9, 2019, 17:34 [IST]
Other articles published on Dec 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X