న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సీనియర్‌ ఆటగాళ్లు రాజకీయాలు చేసి చోటు దక్కించుకున్నారు.. ఇక వెళ్లిపోండి'

Waqar Younis Slams Pak Senior Players || Oneindia Telugu
Waqar Younis slams senior Pakistan players over lingering on in their careers

ప్రపంచకప్‌లో ఆడాలనే కోరికతో కొందరు సీనియర్‌ ఆటగాళ్లు ఎలాంటి అర్హత లేకున్నా రాజకీయాలు చేసి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక మీరు ఆడింది చాలు వెళ్లిపోండి అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వకార్‌ యూనిస్‌ మండిపడ్డారు. మెగా టోర్నీలో పాకిస్థాన్ లీగ్ దశ నుండే నిష్క్రమించింది. టోర్నీ ఆరంభంలో తడబడ్డ పాక్.. ఆ తర్వాత వరుస విజయాలతో రేసులోకి వచ్చింది. అయితే ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో పాక్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి.

బోర్డుపై మాజీల విమర్శలు:

బోర్డుపై మాజీల విమర్శలు:

టీమిండియాపై పాక్ ఓడిపోవడం, మెగా టోర్నీ నుండి పాకిస్తాన్‌ నిష్క్రమించడంతో ఆ దేశ అభిమానులు, మాజీలు ఆటగాళ్ల ప్రదర్శనపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా షోయబ్ మాలిక్, కెప్టె సర్ఫరాజ్ అహ్మద్‌లను ఓ ఆటాడుకున్నారు. తాజాగా వకార్‌ యూనిస్‌ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలువురు సీనియర్‌ ఆటగాళ్లు, బోర్డుపై మండిపడ్డాడు.

జట్టుపై క్లారిటీ లేదు:

జట్టుపై క్లారిటీ లేదు:

'చివరి క్షణం వరకు పాక్ ప్రపంచకప్ జట్టుపై క్లారిటీ లేదు. సీనియర్ ఆటగాళ్ళు రిటైర్మెంట్ ఇవ్వకుండా.. జట్టులో చోటు దక్కించుకున్నారు. టోర్నీలో ఆడాలనే కోరికతో కొందరు ఎలాంటి అర్హత లేకున్నా రాజకీయాలు చేసి జట్టులోకి వచ్చారు. వాళ్లు పాక్‌ క్రికెట్‌ జట్టును నాశనం చేశారు. ఇక మీరు ఆడింది చాలు వెళ్లిపోండి' అని వకార్‌ యూనిస్‌ అన్నారు.

బోర్డు ఆలోచన మారాలి:

బోర్డు ఆలోచన మారాలి:

'ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీల్లోని పాక్ జట్టును చాలా సార్లు గమనించా. ఓడిపోతామనే భయంతో పాక్ సెలెక్టర్లు సీనియర్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటున్నారు. ప్రతీసారి ఇదే ఫార్ములాను పాటిస్తుంది. ఇదే టోర్నీ నుండి బయటకు వచ్చేలా చేస్తుంది. ఓడిన ప్రతిసారి కోచింగ్‌ బృందాన్ని, సెలక్టర్లను మార్చుతుంది కానీ మార్పులు మాత్రం తేవట్లేదు. బోర్డు ఆలోచన మారనంత వరకు ప్రపంచకప్‌లో పాక్‌ ప్రదర్శన మారదు. సీనియర్‌ ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇచ్చినా.. ఏం నష్టం జరగదు' అని వకార్‌ యూనిస్‌ పేర్కొన్నాడు.

టీమిండియాపై కూడా:

టీమిండియాపై కూడా:

ఇంగ్లండ ఓటమి అనంతరం టీమిండియాపై కూడా వ‌కార్ యూనిస్ విమర్శలు గుప్పించాడు. 'ఇలాంటి ఓట‌మిని తాను ఊహించ‌లేదు. పాకిస్తాన్ సెమీఫైన‌ల్‌కు వెళ్తుందా? లేదా? అనే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి చూస్తే.. టీమిండియా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించింది. టీమిండియాలో కొంత‌మంది ఛాంపియ‌న్లు దారుణంగా విఫ‌లం అయ్యారు' అని అన్నారు.

Story first published: Thursday, July 18, 2019, 12:47 [IST]
Other articles published on Jul 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X