న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పోర్న్ వీడియోలు పెడుతారా.. ఇక సోషల్ మీడియా వైపు కన్నెత్తి చూడను: మాజీ దిగ్గజం

Waqar Younis says Someone hacked my Twitter account, liked obscene video

కరాచీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ సమయాన్ని అందరూ కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంటే.. కొందరు ఆకతాయిలు మాత్రం సోషల్ మీడియాలో అశ్లీల వీడియో క్లిప్‌లను పోస్ట్ చేస్తున్నారు. సెలెబ్రిటీల, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను హ్యాక్ చేసి.. అందులో ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్ అయింది. ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ అశ్లీల వీడియో క్లిప్ కూడా జత చేసాడట హ్యాకర్. విషయం తెలుసుకున్న వకార్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.

2011 ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీ రెండోసారి టాస్‌ వేద్దామన్నాడు.. ఆసక్తికర విషయం చెప్పిన సంగక్కర!!2011 ప్రపంచకప్‌ ఫైనల్లో ధోనీ రెండోసారి టాస్‌ వేద్దామన్నాడు.. ఆసక్తికర విషయం చెప్పిన సంగక్కర!!

ట్విట్టర్ ఖాతా హ్యాక్

ట్విట్టర్ ఖాతా హ్యాక్

తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయినందున సోషల్ మీడియా నుండి దూరం కావాలని వకార్ యూనిస్ నిర్ణయించుకున్నాడట. శుక్రవారం ఉదయం వకార్ యూనిస్ ఒక వీడియోను విడుదల చేసి.. అందులో మొత్తం సంఘటనను వివరించాడు. ఇక సోషల్ మీడియాను మరలా కన్నెత్తి చూడనన్నాడు. తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదన్నాడు. సోషల్ మీడియా ఖాతాలలో ఈ వీడియో తన చివరి పోస్ట్ కావచ్చు అని అభిప్రాయపడ్డాడు. వకార్ పాక్ తరఫున 87 టెస్టులు, 262 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 373, వన్డేల్లో 416 వికెట్లు పడగొట్టాడు.

ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ చేసారు:

ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ చేసారు:

శుక్రవారం వకార్ యూనిస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. 'ఈ రోజు ఉదయం నేను నిద్ర లేచేసరికి ఎవరో నా ట్విట్టర్ హ్యాండిల్ను హ్యాక్ చేసారు. నా ఖాతా నుండి కొన్ని అశ్లీల వీడియోలు లైక్ చేయబడ్డాయి. ఇది అవమానకరమైన విషయం. నాకు, నా కుటుంబ పరువుకి సంబందించిన విషయం. సోషల్ మీడియా లేదా ట్విట్టర్.. ప్రజల మధ్య బంధాన్ని పెంచుతుందనుకున్నా. అందరూ మాట్లాడుకోవడానికి ఇదొక మార్గం అనుకున్నా. కానీ ఈ వ్యక్తి ప్రతిదీ నాశనం చేశాడు' అని వకార్ తెలిపాడు.

 ఇక సోషల్ మీడియాలో చూడలేరు:

ఇక సోషల్ మీడియాలో చూడలేరు:

ఇప్పటికే మూడు నాలుగు సార్లు నా అకౌంట్ హ్యాక్ అయింది. అతడే ప్రతిసారి నా అకౌంట్ హ్యాక్ చేస్తున్నాడనుకుంటా. ఇది ఇక్కడితో ఆగిపోదు. మరోసారి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు తరువాత ఇక నేను సోషల్ మీడియాలోకి రావొద్దని నిర్ణయించుకున్నా. ఎందుకంటే నేను నా కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఇక మీరు నన్ను సోషల్ మీడియాలో చూడలేరు. ఈ విషయం ఎవరినైనా బాధపెడితే నన్ను క్షమించండి' అని వకార్ యూనిస్ పేర్కొన్నాడు.

డబ్బులు సంపాదించడంపైనే ఆసక్తి:

డబ్బులు సంపాదించడంపైనే ఆసక్తి:

ఈ తరం క్రికెటర్లు దేశం తరఫున ఆడటం కంటే సులువుగా డబ్బులు సంపాదించడంపైనే ఆసక్తి కనబరుస్తున్నారని వకార్ యూనిస్ ఇటీవలే అభిప్రాయపడ్డాడు. 'టీ20 లీగ్స్‌ క్రికెటర్ల‌కు సులువుగా డబ్బులను ఆఫర్ చేస్తున్నాయి. మరోవైపు ఆటగాళ్లు కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదనే భావనలో ఉంటున్నారు. ముఖ్యంగా బౌలర్లు అయితే కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే వేయాల్సి ఉండటంతో చాలా సౌకర్యంగా ఫీలవుతున్నారు. కానీ వారి వల్ల జాతీయ జట్టుకు జరగుతున్న నష్టాన్ని తెలుసుకోలేకపోతున్నారు. విశాల దృక్పథంతో ఆలోచించడం లేదు' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, May 29, 2020, 13:41 [IST]
Other articles published on May 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X