న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'క్రికెట్‌లోని అన్ని బ్యాటింగ్ రికార్డులను కోహ్లీ బద్దలు కొడతాడు'

By Nageshwara Rao
Waqar tips Kohli to break all batting records

హైదరాబాద్: క్రికెట్‌లోని అన్ని బ్యాటింగ్ రికార్డుల్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు చేయగలడని పాకిస్థాన్ మాజీ బౌలర్ వఖార్ యూనిస్ అభిప్రాయపడ్డాడు. 'విరాట్ కోహ్లీ ఫిటెనెస్‌, ఆటని ఆస్వాదించే తీరు అమోఘం. రాబోయే రోజుల్లో అన్ని బ్యాటింగ్ రికార్డుల్ని బద్దలు కొట్టగలిగే ప్రతిభ అతనిలో ఉంది' అని వకార్ యూనిస్ అన్నాడు.

ఇప్పటికే తాను అన్ని రికార్డుల్ని అందుకోగలనని విరాట్ కోహ్లీ నిరూపించుకున్నాడని వకార్ చెప్పాడు. 'ఆటను ఆస్వాధిస్తూ.. ఫిట్‌నెస్ లెవెల్స్‌ను అలాగే మెయింటెన్ చేసుకోవడంతో పాటు.. బ్యాటింగ్ టెక్నిక్స్‌పై ఫోకస్ పెట్టినట్లయితే కోహ్లీ రానున్న రోజుల్లో బ్యాటింగ్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టగలడు' అని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యున్నతమైన నైపుణ్యం గల ఆటగాడు ఎవరైనా ఉంటే అది విరాట్ కోహ్లీనే అని ప్రశంసించాడు. ఇటీవలే బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు. జనవరి 5 నుంచి కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సుదీర్ఘ సిరిస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.

ఈ పర్యనటలో టీమిండియా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. దక్షిణాఫ్రికా సిరిస్ రూపంలో విరాట్ కోహ్లీ ఓ కఠిన పరీక్షను ఎదుర్కొనున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సామర్థ్యంపై వకార్ యూనిస్ స్పందించాడు. ఇక, కోహ్లీని క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండల్కర్‌తో పోల్చడంపై కూడా స్పందించాడు.

'సచిన్‌తో కలిసి నేను చాలా మ్యాచ్‌లు ఆడాను. ఇంకా చెప్పాలంటే పాక్‌పైనే అతను అరంగేట్రం చేశాడు. దీంతో సచిన్ కెరీర్ ఆరంభం నుంచి దిగ్గజ ఆటగాడిగా ఎదగడం వరకు నేను గమనించాను. ఆటపై అంత కమిట్‌మెంట్ కలిగిన ఆటగాన్ని ఎప్పుడూ చూడేలేదు. అతనో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. సచిన్‌కి బౌలింగ్ చేయడం ఓ సవాల్' అని చెప్పాడు.

'నా బౌలింగ్ ఎదుర్కొన్న వారిలో సచిన్ బెస్ట్‌ బ్యాట్స్‌మెన్. ఇక లారా ప్రకృతి ఇచ్చిన వరం.. ఆ రోజుల్లో లారా తన అద్భుత బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించేవాడు' అని వకార్ చెప్పుకొచ్చాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 24, 2017, 19:46 [IST]
Other articles published on Dec 24, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X