న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పోటీ నుంచి తప్పుకున్న అక్రమ్: పాక్ బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్ ఎంపిక లాంఛనమే!

Waqar likely to be appointed as Pakistan bowling coach

హైదరాబాద్: పాకిస్థాన్ జట్టు బౌలింగ్ కోచ్‌గా మాజీ పేసర్ వకార్ యూనిస్‌ను నియమించేందుకు రంగం సిద్ధమైంది. సహాయక సిబ్బందికోసం గురువారం నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బౌలింగ్ కోచ్‌కు వకార్ యూనిస్‌కు గట్టి పోటీ ఇస్తోన్న మాజీ టెస్టు బౌలర్ ముమహ్మద్ అక్రమ్ పోటీ నుంచి తప్పుకున్నాడు.

మరోవైపు బౌలింగ్ కోచ్‌‌ పదవికి దరఖాస్తు చేసుకున్న మరో టెస్టు పేసర్ జలాలుద్దీన్‌ను బోర్డు అసలు ఇంటర్వ్యూ ప్రక్రియకు ఎంపిక చేయలేదు. దీంతో బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్ ఎన్నిక లాంఛనమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. లెవెల్ ఫోర్ కోచ్‌గా ఉన్న జలాలుద్దీన్ పీసీబీ అతడిని ట్రీట్ చేసిన విధానం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

బౌలింగ్ కోచ్ పదవికి

బౌలింగ్ కోచ్ పదవికి

బౌలింగ్ కోచ్ పదవికి గాను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్దేశించిన అన్ని అర్హతలను పొందినప్పటికీ బోర్డు తనను ఇంటర్వ్యూ ప్రక్రికయకు ఎంపిక చేయకపోవడం నిరాశకు గురి చేసిందని తెలిపాడు. కరాచీలో రిపోర్టర్లతో మాట్లాడిన జలాలుద్దీన్ "బోర్డు తమ మాస్టర్ కోచ్‌లను విస్మరించి వారి పట్ల ఇలాగే ప్రవర్తిస్తే... పాకిస్తాన్ క్రికెట్ ముందుకు సాగదు" అని హెచ్చరించారు.

ఇంతికాబ్ ఆలం నేతృత్వంలోని కమిటీ

ఇంతికాబ్ ఆలం నేతృత్వంలోని కమిటీ

ఇంతికాబ్ ఆలం నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే హెడ్ కోచ్ రేసులో ఉన్న అభ్యర్ధులను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. పాక్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హాక్, టెస్టు ఓపెనర్ మొయిన్ ఖాన్‌లు నేరుగా ఈ ఇంటర్వ్యూ ప్రక్రియకు హాజరుకాగా.. ఆస్ట్రేలియాకు చెందిన డీన్ జోన్స్ స్కైప్ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యారు.

ఆశ్చర్యకర విషయం ఏంటంటే

ఆశ్చర్యకర విషయం ఏంటంటే

ఆశ్చర్యకర విషయం ఏంటంటే మిస్బా ఉల్ హక్ లేదు డీన్ జోన్స్‌కు గతంలో ఎలాంటి కోచింగ్ అనుభవం లేకపోవడం విశేషం. హెడ్ కోచ్‌ ఇంటర్వ్యూ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్‌లతో పాటు ఫిట్‌నెస్ ట్రైనర్‌లను ఎంపిక చేయనున్నారు. ఇందులో భాగంగా సహాయక సిబ్బంది కోసం ఇంటర్వ్యూలను గురువారం నుంచి బోర్డు ప్రారంభించనుంది.

హెడ్ కోచ్‌గా మిస్బా ఉల్ హక్ ముందంజ

హెడ్ కోచ్‌గా మిస్బా ఉల్ హక్ ముందంజ

కాగా, హెడ్ కోచ్‌గా మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్‌లు రేసులో ముందంజలో ఉన్నారు. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే‌వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు విఫలం కావడంతో హెచ్ కోచ్‌గా ఉన్న మిక్కి ఆర్థర్‌తో పాటు సహాయక సిబ్బంది కాంట్రాక్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పొడిగించని సంగతి తెలిసిందే.

Story first published: Friday, August 30, 2019, 12:46 [IST]
Other articles published on Aug 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X