న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sydney Test: డుప్లెసిస్‌ను స్ఫూర్తిగా తీసుకున్నా.. పట్టుదలగా బ్యాటింగ్‌ చేశా: అశ్విన్‌

Wanted to bat like Faf du Plessis: Ravichandran Ashwin reveals his batting secret in Sydney Test

సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ (39 నాటౌట్‌; 128 బంతుల్లో 7×4), హనుమ విహారి (23 నాటౌట్‌; 161 బంతుల్లో 4×4) అద్భుతంగా ఆడి భారత్‌ను ఓటమి నుంచి బయటపడేశారు. 259 బంతులాడి కేవలం 62 పరుగులు చేశారు. వీరి దూర్బేధ్యమైన డిఫెన్స్‌ను ఆసీస్ బౌలర్లు ఛేదించలేకపోయారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇక మూడు టెస్టులు పూర్తయ్యేసరికి భారత్‌ 1-1తో సమానంగా నిలిచింది. అశ్విన్‌ తనకు అన్నలా వెన్నుతట్టి ముందుకు నడిపాడని హనుమ విహారి చెప్పాడు. క్రీజులో తనకు పెద్దన్నలా అండగా నిలబడ్డాదని ఆకాశానికెత్తేశాడు.

పెద్దన్నలా సలహాలిచ్చాడు:

పెద్దన్నలా సలహాలిచ్చాడు:

మ్యాచ్ అనంతరం తెలుగు క్రికెటర్ హనుమ విహారి మాట్లాడుతూ.. 'బ్యాటింగ్‌ చేసేటప్పుడు అశ్విన్‌ పెద్దన్నలా సలహాలిచ్చాడు. ధ్యాసంతా మ్యాచ్‌పైనే పెట్టాలని, వీలైనంతసేపు క్రీజులో పాతుకుపోవాలని సూచించాడు' అని తెలిపాడు. తామిద్దరం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఆడామని, ఈ ఇన్నింగ్స్‌ తమ ఇద్దరికీ ఎంతో ప్రత్యేకమని విహారి చెప్పాడు. విహారి మొదటి రెండు టెస్టుల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు. మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ వరుసగా 16, 8, 21 పరుగులు మాత్రమే చేశాడు. ఇక సిడ్నీలో చివరి రోజు క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే అతని తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతను క్రీజులో నిలవగలడా? అనే సందేహం కలిగింది. అయితే అన్ని సవాళ్ల మధ్య అమోఘంగా బ్యాటింగ్‌ చేశాడు.

డుప్లెసిస్‌ను స్ఫూర్తిగా తీసుకున్నా

డుప్లెసిస్‌ను స్ఫూర్తిగా తీసుకున్నా

ఆట పూర్తయ్యాక ఎలా స్పందించాలో తెలియలేదని ఆర్ అశ్విన్‌ పేర్కొన్నాడు. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చెప్పాడు. 'ఆదివారం రాత్రి నేను నిద్రపోయే ముందు చివరి రోజు వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నా. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌ను స్ఫూర్తిగా తీసుకొని పట్టుదలగా బ్యాటింగ్‌ చేయాలని అనుకున్నా. అలానే ఆడాను' అని అశ్విన్‌ తెలిపాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అశ్విన్, విహారిలను మాజీలు పొగడ్తలతో ముంచెత్తారు. అద్భుతంగా ఆడారని, టెస్టు ఎలా ఆడాలో నిరూపించారని ప్రశంశలతో ముంచెత్తారు.

ఆడు మామ ఆడు

ఆడు మామ ఆడు

అశ్విన్, విహారి ఆడుతున్న సమయంలో వారి ఏకాగ్రతని చెదరగొట్టేందుకు ఆస్ట్రేలియా టీమ్ చేయని ప్రయత్నం లేదు. విహారి చుట్టూ ఫీల్డర్లని మొహరించి వారితో స్లెడ్జింగ్ చేయించడమే కాకుండా.. కెప్టెన్ టిమ్ పైనీ కూడా వికెట్ల వెనుక నుంచి తరచూ నోరు జారుతూ కనిపించాడు. కానీ విహారికి చివరి వరకూ అశ్విన్ అండగా నిలిచాడు. విహారిలో ఉత్సాహం నింపేందుకు 'ఆడు మామ ఆడు' అంటూ తమిళ పాటని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి మరీ మైదానంలో పాడుతూ కనిపించాడు. విహారితో ఇలా అశ్విన్ తెలుగులో మాట్లాడటం ఇదేమీ తొలిసారి కాదు. 2020 ఏప్రిల్‌లో లాక్‌డౌన్ సమయంలో విహారితో లైవ్ ఛాట్ చేసి అశ్విన్.. తనకి తెలుగు సినిమాలంటే భలే ఇష్టమని చెప్పుకొచ్చాడు.

సిడ్నీ టెస్ట్ హీరోలను.. టీమిండియా ఆటగాళ్లు ఎలా రిసీవ్ చేసుకున్నారో చూడండి (వీడియో)

Story first published: Tuesday, January 12, 2021, 13:57 [IST]
Other articles published on Jan 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X