ఈ ఇన్నింగ్స్‌ నాకు ప్రేరణ ఇచ్చింది, ఇంకా నిరూపించుకోవాలి: ఏబీ

Posted By:
 AB de Villiers

హైదరాబాద్: దక్షిణాఫ్రికా జట్టులో తన విలువను కాపాడుకోవాలంటే మెరుగైన ప్రదర్శనలు ఎంతైనా అవసరమని ఆ జట్టు స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పష్టం చేశాడు. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం సాధించడంలో డివిలియర్స్ కీలక ఇన్నింగ్స్ కూడా కారణం.

ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా 2018 2nd టెస్టు స్కోరు కార్డు

తొలి ఇన్నింగ్స్‌లో ఏబీ డివిలియర్స్ 126 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో దక్షిణాఫ్రికాను ఆధిక్యంలో నిలిపాడు. ఈ సందర్భంగా డివిలియర్స్ తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. అయితే తనను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఇంకా ఉందని స్పష్టం చేశాడు.

'నేను ఇంకా గేమ్‌ ఆడగలను అనడానికి ఈ ఇన్నింగ్స్‌ నాకు ప్రేరణ ఇచ్చింది. నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని బలంగా నమ్ముతున్నా. ఇటీవల కాలంలో నేను శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయా. ఇందుకు పలు కారణాలున్నాయి' అని డివిలియర్స్ అన్నాడు.

'నేను తండ్రిని కావడంతో పాటు, అనేక విషయాలు నా జీవితంలో చోటు చేసుకున్నాయి. తాజా ఇన్నింగ్స్‌తో కొద్ది పాటి ఊపిరి తీసుకున్నట్లు అయింది. నాపై జట్టు మేనేజ్‌మెంట్‌ నమ్మకాన్ని నిలబెట్టాలంటే కీలక ఇన్నింగ్స్‌లు ఆడి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది' అని పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే రెండో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టు మ్యా‌చ్‌ల సిరిస్ 1-1తో సమం అయింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 101 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 22.5 ఓవర్లలో చేధించింది. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, March 12, 2018, 21:33 [IST]
Other articles published on Mar 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి