న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'వెస్టిండీస్ పై విరుచుకుపడాలని ముందుగానే అనుకున్నాం'

India vs West Indies 2018,T20I: Wanted My Team to be Ruthless Says Rohit Sharma | Oneindia Telugu
Wanted My Team to be Ruthless, Says Rohit Sharma After India Seal T20 Series

హైదరాబాద్: చెన్నైలోని చిదంబర స్వామి స్టేడియం వేదికగా జరిగిన మూడో టో20లో వెస్టిండీస్‌పై ప్రతిదాడికి దిగడంలో వ్యూహాన్ని రోహిత్ బయటపెట్టాడు. రెండు ఫార్మాట్లతో పాటుగా ఆఖరిదైన టీ20సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌లలో విజయాన్ని దక్కించుకుంది. ఇంక మిగిలిందొక్కటే అనుకున్న ఆఖరి టీ20లో టీమిండియాదే పై చేయి కావాలని భావించి చక్కటి వ్యూహంతో బరిలోకి దిగినట్లు ఆయన పేర్కొన్నాడు.

182పరుగుల టార్గెట్‌ను చిత్తుగా ఆడాలని:

182పరుగుల టార్గెట్‌ను చిత్తుగా ఆడాలని:

ఈ క్రమంలో ఆదివారం ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో ముప్పేటదాడికి ముందే నిర్ణయించుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 181 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు పరవాలేదనిపించినా.. క్రమంగా వేగం తగ్గించారు. ఫీల్డింగ్‌లో మాత్రం కట్టుదిట్టం చేసి ఫలితాన్ని చివరి బంతి వరకూ పొడిగించారు.

మ్యాచ్‌ కంటే ముందే సిరీస్ చేజిక్కించడంతో

మ్యాచ్‌ కంటే ముందే సిరీస్ చేజిక్కించడంతో

ఛేదనలో శిఖర్ ధావన్ (92: 62 బంతుల్లో 10ఫోర్లు, 2సిక్సులు), రిషబ్ పంత్ (58: 38 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సులు) మెరుపులు మెరిపించడంతో ఆఖరి బంతికి సింగిల్ తీసిన భారత్ జట్టు గెలుపొందింది. మూడు టీ20ల ఈ సిరీస్‌ని 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌ కంటే ముందే సిరీస్ చేజిక్కించడంతో.. విండీస్‌పై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడాలని తాము ముందే అనుకున్నట్లు రోహిత్ చెప్పుకొచ్చాడు.

కష్టాల్లో శ్రీలంక జట్టు: ధనంజయ బౌలింగ్‌ యాక్షన్‌పై ఐసీసీకి ఫిర్యాదు

నాలుగో బంతి వృథా.. ఐదో బంతికి ఔట్

నాలుగో బంతి వృథా.. ఐదో బంతికి ఔట్

మ్యాచ్‌లో భారత్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 5 పరుగులు అవసరమగా.. మొదటి 3 బంతుల్లోనే 4 పరుగులు రావడంతో స్కోరు సమమైంది. ఈ దశలో భారత్ విజయంపై ఎవరికీ సందేహాల్లేవు. కానీ.. నాలుగో బంతికి ఒక్క పరుగు కూడా చేయకుండా వృథాగా పోనిచ్చిన ధావన్.. ఐదో బంతికి ఔటవడంతో ఆఖరి బంతికి ఒక పరుగు అవసరమైంది. అయితే.. చివరి బంతిని సమర్థవంతంగా ఆడిన మనీశ్ పాండే సింగిల్ తీయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది.

ఒత్తిడిలో పూర్తి చేయడం గొప్ప ప్రదర్శన

ఒత్తిడిలో పూర్తి చేయడం గొప్ప ప్రదర్శన

ఐపీఎల్‌లో ఆఖరి బంతికి ముగిసే మ్యాచ్‌లు ముంబై ఇండియన్స్‌‌కి ఆడిన నాకు స్వీయానుభవమే. అయితే.. ఒత్తిడిలో ఆ గెలుపు లాంచనాన్ని పూర్తి చేయడం మాత్రం గొప్ప ప్రదర్శన. ఈ మ్యాచ్‌ ఆరంభానికి ముందే.. వెస్టిండీస్‌ జట్టుపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. ఇలా ఒత్తిడిలో ముగిసే మ్యాచ్‌ల నుంచి యువ క్రికెటర్లు చాలా అంశాలు నేర్చుకుంటారు.

Story first published: Monday, November 12, 2018, 14:20 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X