న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కష్టాల్లో శ్రీలంక జట్టు: ధనంజయ బౌలింగ్‌ యాక్షన్‌పై ఐసీసీకి ఫిర్యాదు

Sri Lankas off-spinner Akila Dananjaya reported for suspicious action during first Test against England

కొలంబో: శ్రీలంక ఆఫ్‌ స్పిన్నర్‌ అకిల ధనంజయ బౌలింగ్‌ యాక్షన్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అనుమానం వ్యక్తం చేసింది. గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక జట్టుపై ఇంగ్లాండ్ 211 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం ధనంజయ బౌలింగ్‌ యాక్షన్‌ అనుమానంగా ఉందంటూ మ్యాచ్‌ అధికారులు ఐసీసీకి నివేదిక ఇచ్చారు.

ధనుంజయ బౌలింగ్ యాక్షన్‌పై ఐసీసీ

దీంతో అతని బౌలింగ్‌ యాక్షన్‌ను పరీక్షించనున్నట్టు ఐసీసీ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. "మరో రెండు వారాల్లో ధనంజయ బౌలింగ్‌ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఫలితం వెలువడే వరకు అతను అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ చేయవచ్చు" అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం ముగిసిన గాలే టెస్టులో ధనంజయ 184 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.

322/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్

322/6 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఇంగ్లాండ్

ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఆతిథ్య శ్రీలంక జట్టు 203 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 139 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు 322/6 వద్ద గురువారం ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

మరో రోజు మిగిలుండగానే తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం

మరో రోజు మిగిలుండగానే తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం

అనంతరం 462 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఛేదన 250 పరుగులకే ఆలౌట్ కావడంతో మరో రోజు మిగిలుండగానే ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రకటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలాంటి కామెంట్ చేయక పోవడం విశేషం.

నవంబర్ 14 నుంచి రెండో టెస్టు

నవంబర్ 14 నుంచి రెండో టెస్టు

ఈ సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టెస్టు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. చివరిదైన మూడో టెస్టు నవంబర్ 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనుంది.

Story first published: Monday, November 12, 2018, 13:13 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X