న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బర్త్ డే స్పెషల్: లక్ష్మణ్ కెరీర్‌లో టాప్ 5 ఇన్నింగ్స్ ఇవే

VVS Laxman turns 44: Heres 5 Very Very Special innings

హైదరాబాద్: బంతి ఎలా వచ్చినా సరే.. తాను అనుకున్నట్లుగా బాదే వీవీఎస్ లక్ష్మణ్ శుభాకాంక్షలు అందుకుంటున్నాడు. తన 44వ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు అందుతున్నాయి. డాక్టర్ కావలసిన తన కెరీర్‌ను మంచి క్రికెటర్‌గా మార్చుకున్న లక్ష్మణ్ గురించి చెప్పకోదగ్గ విషయాలలో కొన్ని:

1. 281 Vs Australia, Kolkata, 2001

1. 281 Vs Australia, Kolkata, 2001

కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 274పరుగుల ఆధిక్యాన్ని సాధించింది భారత్. అప్పటికీ ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న స్టీవ్ వా చేతిలో ఉంది ఫలితం గురించి ఎదురుచూడటమే. ముంబై వేదికగా గెలుపు దక్కిన తర్వాత మరోసారి విజయం దక్కుతుందన్న ఆస్ట్రేలియా తలంపును టీమిండియా తిప్పికొట్టింది. లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లు ఇద్దరూ కలిసి 376పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 657పరుగులతో డిక్లేర్ చేయగలిగింది. దీంతో భారత్ మ్యాచ్ గెలవడమే కాక, ఆ తర్వాత చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌తో సిరీస్‌ను గెలుచుకుంది. దీంతో లక్ష్మణ్ పేరు చరిత్రలో నిలిచిపోయింది.

2. 103 Vs Sri Lanka, Colombo, 2010

2. 103 Vs Sri Lanka, Colombo, 2010

నాలుగో ఇన్నింగ్స్‌లో 257పరుగుల లక్ష్యం చేధించడం అంత కష్టమైన పనేం కాదు. అది కూడా శ్రీలంక సొంతగడ్డపై మ్యాచ్ అంటే చాలా కష్టంతో కూడుకున్న పనే. ఈ క్రమంలో మైదానంలో 62పరుగుల వద్ద బరిలోకి దిగిన లక్ష్మణ్ సెంచరీ బాది భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.

3. 96 Vs South Africa, Durban, 2010

3. 96 Vs South Africa, Durban, 2010

దర్బన్ వేదికగా 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లక్ష్మణ్ చేసిన 96పరుగులు మ్యాచ్‌కు కీలకంగా నిలిచాయి. ఫాస్ట్ బౌలర్లు డేల్ స్టేన్, మోర్నె మోర్కెల్, జాక్వెస్ కల్లీస్, లొనావడో సోసోబ్‌లను గడగడలాడించేశాడు. సెంచరీ చేసేందుకు 4పరుగుల మిగిలిపోయాయని నిరుత్సాహపడినా.. 87పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలిచింది.

4. 73 n.o. Vs Australia, Mohali, 2010

4. 73 n.o. Vs Australia, Mohali, 2010

216 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 124పరుగులు చేసింది. అప్పటికే ఎనిమిది వికెట్లు నష్టపోయింది టీమిండియా, ఈ క్రమంలో లక్ష్మణ్ ఆస్ట్రేలియాతో పోరాడి జట్టును గెలిపించాడు. క్రీజులో ఇషాంత్ శర్మ.. లక్ష్మణ్‌లు ఇద్దరు కలిపి టీమిండియా లక్ష్యానికి 11పరుగుల దూరం వరకూ తీసుకురాగలిగారు. ఆ సమయంలో వికెట్ కోల్పోయిన ఇషాంత్ స్థానంలో ప్రగ్యాన్ ఓజా మంచి తోడ్పాటును అందించడంతో ఎట్టకేలకు విజయాన్ని చేరుకోగలిగారు.

5. 148 Vs Australia, Adelaide, 2003

5. 148 Vs Australia, Adelaide, 2003

ఆస్ట్రేలియా నిర్దేశించిన 556పరుగుల లక్ష్యాన్ని తన చిరకాల భాగస్వాయి అయిన ద్రవిడ్‌తో కలిసి సునాయాసంగా చేధించాడు. ఈ సిరీస్‌లో లక్ష్మణ్ 148, ద్రవిడ్ 233 పరుగులతో లక్ష్యాన్ని చేధించారు.

Story first published: Thursday, November 1, 2018, 15:21 [IST]
Other articles published on Nov 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X