న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్: 'వార్నర్‌ ఆడట్లేదని తెలిసి నా పిల్లలు తెగ ఏడ్చారు' (వీడియో)

By Nageshwara Rao
VVS Laxman Shares A Sentimental Story About David Warner
VVS Laxman shares an emotional anecdote about David Warner and his absence from IPL this year

హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడట్లేదని తెలిసి తన పిల్లలు తెగ ఏడ్చారని టీమిండియా మాజీ క్రికెటర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. తాజాగా వీవీఎస్ లక్ష్మణ్ 'బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే వెబ్ షోలో పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా అభిమానులతో తన అనుభవాలను పంచుకున్నాడు. ఈ ఏడాది మొదట్లో సఫారీ గడ్డపై ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరూన్ బాన్ క్రాప్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే.

స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం

స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం

దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించగా... టాంపరింగ్‌కు పాల్పడిన కామెరూన్ బాన్ క్రాప్ట్‌పై తొమ్మిది నెలల పాటు నిషేధం విధించింది. స్మిత్, వార్నర్‌లపై విధించిన నిషేధం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2018 సీజన్‌పై కూడా ప్రభావం చూపింది.

 ఐపీఎల్ 2018 సీజన్ నుంచి తప్పుకున్న స్మిత్, వార్నర్

ఐపీఎల్ 2018 సీజన్ నుంచి తప్పుకున్న స్మిత్, వార్నర్

దీంతో ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్‌ నుంచి ఇద్దరూ తప్పుకున్నారు. ఐపీఎల్‌లో స్టీవ్ స్మిత్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా... డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దీంతో ఆయా రెండు ప్రాంఛైజీలు సైతం ఈ ఇద్దరినీ కెప్టెన్సీ నుంచి తొలగించాయి.

సర్వజిత్‌, ఆచింత్య ఐపీఎల్‌ బాగా చూస్తారు

సర్వజిత్‌, ఆచింత్య ఐపీఎల్‌ బాగా చూస్తారు

ఈ విషయంపై తాజాగా లక్ష్మణ్ మాట్లాడుతూ "బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న డేవిడ్‌ వార్నర్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏడాది నిషేధం విధించింది. అంతేకాదు ఆసీస్‌ జట్టుకు ఎప్పటికీ నాయకుడిగా బాధ్యతలు చేపట్టడానికి వీలులేదని తెలిపింది. నా పిల్లలు సర్వజిత్‌, ఆచింత్య ఐపీఎల్‌ బాగా చూస్తారు" అని అన్నాడు.

వార్నర్‌ ఎంత కీలక సభ్యుడో కూడా వారికి తెలుసు

"సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో వార్నర్‌ ఎంత కీలక సభ్యుడో కూడా వారికి తెలుసు. ఈ ఏడాది ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌ ఆడట్లేదన్న వార్తను సర్వజిత్‌, ఆచింత్య వార్తాపత్రికల్లో చూసి ఏడవడం మొదలుపెట్టారు. నాన్న... ఇది నిజమేనా. ఈ ఐపీఎల్‌లో వార్నర్‌ ఆడట్లేదా? అని నన్ను అడిగారు. వారికి నేను ఏదో సర్ది చెప్పా. వార్నర్‌ ఆడట్లేదని తెలిసి వారిద్దరూ చాలా బాధపడ్డారు. ఆ తర్వాత ఫైనల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓడిన సమయంలోనూ వారు చాలా నిరాశ చెందారు" అని లక్ష్మణ్ తెలిపాడు.

Story first published: Saturday, July 14, 2018, 10:13 [IST]
Other articles published on Jul 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X