న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు మరో భారత క్రికెటర్ వీడ్కోలు

VRV Singh retires from cricket after an injury-hampered career

హైదరాబాద్: 2006-07 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన పంబాజ్ క్రికెటర్ వీఆర్వీ సింగ్ తరచూ గాయాల బారిన పడుతుండటంతో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. 34 ఏళ్ల వీఆర్వీ సింగ్ 2006లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌ని వెస్టిండీస్‌తో సెయింట్ జాన్ స్టేడియం వేదికగా ఆడాడు. భారత్ తరుపున మొత్తం ఐదు టెస్టులాడిన వీఆర్వీ సింగ్ ఎనిమిది వికెట్లు తీసుకోగా... రెండు వన్డేలాడి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.

<strong>ఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా సౌరవ్ గంగూలీ</strong>ఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా సౌరవ్ గంగూలీ

తన వీడ్కోలు సందర్భంగా ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్ఫోకి ఇచ్చిన ఇంటర్యూలో "తిరిగి క్రికెట్ ఆడేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ.. గాయాలు తరచూ వేధిస్తున్నాయి. 2014లో సర్జరీ జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లు క్రికెట్‌కు దూరమయ్యా. ఆ తర్వాత కొంత ట్రైనింగ్ తీసుకోవడంతో 2018లో క్రికెట్ ఆడా. ఆ తర్వాతి రోజుల్లో ఇబ్బంది కావడంతో భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నా" అని తెలిపాడు.

1984 సెప్టెంబర్ 17న పుట్టిన వీఆర్వీ సింగ్ పంజాబ్ తరపున దేశీవాళీ లీగ్‌లలో ఆడాడు. 2003-04లో లిస్ట్ ఏ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన వీఆర్వీ సింగ్ 2004లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‍‌లలో 31 వికెట్లు తీసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో 2007లో తన చివరి టెస్టు మ్యాచ్‌ని ఆడాడు.

2014లో ముగిసిన రంజీ సీజన్‌లో జమ్మూ కాశ్మీర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన వీఆర్వీ సింగ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇదే సింగ్ ఆఖరి దేశవాళీ లీగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి 3 సీజన్లకు ప్రాతినిధ్యం వహించాడు.

Story first published: Thursday, March 14, 2019, 16:13 [IST]
Other articles published on Mar 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X