న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘యాక్ట్ ఆఫ్ గాడ్’: మాక్స్‌వెల్ ఇన్నింగ్స్ అద్భుతమని సెహ్వాగ్

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 145 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లేన్ మాక్స్‌వెల్‌పై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా నుంచి ఇదొక అద్భుత ప్రదర్శన అని కొనియాడాడు.

మాక్స్‌వెల్ చేసిన అద్భుత శతకంను 'యాక్ట్ ఆఫ్ గాడ్(దేవుడు చేసిన పని)' అని సోషల్ మీడియా ద్వారా సెహ్వాగ్ నెటిజన్లతో వ్యాఖ్యానించాడు. ప్రపంచ ఉత్తమ ఓపెనర్లలో ఒకడిగా కీర్తించబడ్డ సెహ్వాగ్‌‌కు నవాబ్ ఆఫ్ నజఫ్‌గఢ్ అనే పేరు కూడా ఉంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటున్న సెహ్వాగ్.. దాదాపు ప్రతీ ముఖ్యమైన విషయంపైనా స్పందిస్తున్నాడు. ప్రత్యర్థులకు పంచ్‌లు కూడా విసురుతున్నాడు.

Virender Sehwag terms Glenn Maxwell's 145* as 'Act of God'

కాగా, కొంత ఆధ్యాత్మిక స్ఫూర్తి మాక్స్‌వెల్‌లో దూరిందని, అందుకనే అతడు అలా బీభత్సం సృష్టించాడని తెలిపాడు. రైనా కూడా ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అందువల్లే చేశాడని తెలిపాడు. మాక్స్‌వెల్ ఆస్ట్రేలియా వన్డే టీం నుంచి స్థానం కోల్పోయిన తర్వాత అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు సెహ్వాగ్.

మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచులో కేవలం 65 బంతుల్లోనే 145 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌లో 20 ఓవర్లలోనే 263 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. కాగా, 65 పరుగుల తేడాతో శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. మాక్స్‌వెల్ అన్నింగ్స్‌లో 9 సిక్స్‌లు, 14ఫోర్లు ఉండటం గమనార్హం.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X