క్రిస్ గేల్ క్రేజీ డ్యాన్స్‌కు కొత్త పేరు పెట్టిన సెహ్వాగ్ (వీడియో)

Posted By:
Virender Sehwag tags Chris Gayle in crazy dance video, gives him a hilarious Punjabi name

హైదరాబాద్: అంతర్జాతీయ టీ20ల్లో పరిచయం అక్కర్లేని పేరు క్రిస్ గేల్. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. గేల్ బ్యాటింగ్‌కే కాదు అతడి డ్యాన్స్‌, చలాకీ తనానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.

గేల్ గెలుపు సంబరాలు ఎంతో ప్రత్యేకం

గేల్ గెలుపు సంబరాలు ఎంతో ప్రత్యేకం

మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత మైదానంలో గేల్ జరుపుకునే సంబరాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఆ సెలెబ్రేషన్స్ చూసేందుకు అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తారు. 2012లో వెస్టిండిస్ జట్టు వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచిన సందర్భంలో గేల్ గంగ్నమ్ స్టైల్, ఛాంపియన్ పాటలపై డ్యాన్స్ చేసి అందరిని అలరించాడు.

 గంగ్నమ్ స్టైల్‌తో ప్రపంచానికి కొత్త గేల్ పరిచయం

గంగ్నమ్ స్టైల్‌తో ప్రపంచానికి కొత్త గేల్ పరిచయం

నిజానికి ఈ గంగ్నమ్ స్టైల్‌ను కనిపెట్టిన కొరియన్ సింగర్ కంటే కూడా క్రిస్ గేలే ఎంతో ఫేమస్ అయ్యాడనడన్న ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. కాగా, గతేడాది వరకూ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడిన గేల్‌ని ఈ ఏడాది వేలంలో కొనుగోలు చేసేందుకు ఆ జట్టు ఆసక్తి చూపలేదు.

రూ. 2 కోట్లకు గేల్‌ను సొంతం చేసుకున్న పంజాబ్

గేల్ కనీస ధర రూ. 2 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అతడిని వేలంలో సొంతం చేసుకుంది. ఇండియాకు వస్తున్నానంటూ ఓ పడవలో బాంగ్రా డ్యాన్స్ చేస్తున్న వీడియోని సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోపై పంజాబ్ జట్టు మెంటార్, డైరెక్టర్ సెహ్వాగ్ తనదైన శైలిలో సెటైర్ వేశాడు.

సెహ్వాగ్

ఓ ఫన్నీ డ్యాన్స్ వీడియోని తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్న సెహ్వాగ్ అందులో గేల్‌ని ట్యాగ్ చేశాడు. అంతేకాదు.. గేల్‌కి సెహ్వాగ్ ‘క్రిసన్‌ప్రీత్ గిల్' అని కొత్త పేరుపెట్టారు. సెహ్వాగ్ పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. పంజాబ్ తమ తొలి మ్యాచ్‌ని ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో ఆడనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Monday, April 2, 2018, 18:13 [IST]
Other articles published on Apr 2, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి