న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ఈ ఐపీఎల్ ప్రత్యేకం: వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag Says Watching MS Dhoni back would be a delight

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతుండటంతో ఈ సీజన్ ఐపీఎల్ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. గత ఏడాదిగా మహీ మైదానానికి దూరంగా ఉన్నాడని, అతని ఆట కోసం ఎదురుచూస్తున్న క్రమంలో ఆకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడని ఈ డాషింగ్ ఓపెనర్ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే ఐపీఎల్‌ 2020 సీజన్‌కు ఎక్స్‌ట్రా ప్రత్యేకత సంతరించుకుందన్నాడు. 'ఈ ఐపీఎల్ సీజన్‌ ప్రతీ ఒక్కరికి ఎక్స్‌ట్రా స్పెషల్‌గా నిలుస్తుందనుకుంటున్నా. ప్రేక్షకులతో పాటు ఆటగాళ్లు ధోనీ మళ్లీ మైదానంలోకి దిగడాన్ని సంతోషాంగా ఆస్వాదిస్తారు.'అని తాను కో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'పవర్ ప్లే విత్ చాంపియన్స్'షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.

Virender Sehwag Says Watching MS Dhoni back would be a delight

ఇక క్రికెట్ భారతీయుల నరనరాల్లో నాటుకుపోయిందన్నాడు. క్రికెట్ పున:ప్రారంభం కోసం యావత్ దేశం ఉత్సాహంగా ఎదురుచూస్తుందన్నాడు. 'కరోనా లాక్‌డౌన్ సమయంలో నేను చాలా పాత మ్యాచ్‌లు చూశాను. వాటిని విశ్లేషించాను. నా సొంత ఇన్నింగ్స్‌లను కూడా అనలైజ్ చేశాను. క్రికెట్ అనేది భారతీయుల డీఎన్‌ఏలోఒక భాగం. క్రికెట్ పునప్రారంభం కోసం అంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

ఇక ఆగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆ వెంటనే సురేశ్ రైనా కూడా గుడ్‌బై చెప్పాడు. సెప్టెంబర్ 19న డిఫెండియంగ్ ముంబై ఇండియన్స్, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2020 సీజన్‌కు తెరలేవనుంది.

మాకు జరిగిన నష్టం పూడ్చలేనిది.. పంజాబ్ పోలీసులకు ధన్యవాదాలు: సురేశ్ రైనామాకు జరిగిన నష్టం పూడ్చలేనిది.. పంజాబ్ పోలీసులకు ధన్యవాదాలు: సురేశ్ రైనా

Story first published: Wednesday, September 16, 2020, 16:50 [IST]
Other articles published on Sep 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X