న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రస్సెల్ నిద్రపోయాడు.. మాక్సీ ఖరీదైన చీర్‌లీడర్‌.. విఫలమైన ఆటగాళ్లపై సెహ్వాగ్‌ సెటైర్స్

 Virender Sehwag says Rs 10 crore cheerleader proved costly for KXIP

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్‌లో విఫలమైన ఆటగాళ్లపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు. సీజన్ జరుగుతుండగానే సోషల్ మీడియా వేదికగా 'వీరూకి బై తక్' పేరిట టీమ్ పెర్ఫామెన్స్‌పై సెటైర్లు పేల్చిన సెహ్వాగ్.. తాజాగా ఇదే కార్యక్రమంలో ఆరోన్‌ ఫించ్‌, ఆండ్రూ రస్సెల్, మాక్స్‌వెల్, షేన్ వాట్సన్‌, డేల్ స్టెయిన్‌ వైఫల్యాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఆరోన్‌ ఫించ్‌... కోహ్లీసేనలో అతడు 'వీరూ' అవుతాడని నా ముద్దుపేరుని అతనికిచ్చాను. కానీ ఆర్‌సీబీకి ఉన్న శాపం అతనిపై తీవ్రంగా ప్రభావం చూపింది. ఈ సీజన్‌లో అతని బ్యాటింగ్‌ ఇంజిన్‌ పనిచేయలేదు. కండల వీరుడు ఆండ్రూ రస్సెల్ ఈ సీజన్‌లో సోమరిగా ఉన్నాడు. చెలరేగుతానని మనకి హామీలు ఇచ్చి నిద్రపోయాడు. అందుకే కోల్‌కతా ప్లేఆఫ్‌కు చేరలేదు. షేన్ వాట్సన్ డిజిల్‌ ఇంజిన్‌పై చెన్నై అభిమానులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఎన్నో కిక్‌స్టార్ట్‌ల తర్వాత ఈ సీజన్‌లో ఇంజిన్‌ పనిచేయడం ప్రారంభించింది. అయితే తన వాహనాన్ని ఇకపై లాగలేనని సీజన్‌ ముగిశాక రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. పంజాబ్‌ జట్టులో రూ.10 కోట్ల ఖరీదైన చీర్‌లీడర్‌. లీగ్‌లో గత కొన్ని సీజన్లుగా తన ప్రదర్శన పేలవంగా కొనసాగుతోంది. అయితే ఈ సారి ఆ రికార్డులు కూడా బద్దలు కొట్టి మరింత విఫలమయ్యాడు. ఇది అతనికి అత్యంత ఖరీదైన విహారయాత్రగా భావించవచ్చు. ఒకప్పుడు ' డేల్ స్టెయిన్ గన్‌' నుంచి వచ్చే బుల్లెట్లను చూసి అందరూ భయపడేవారు. కానీ ఈ సీజన్‌లో స్టెయిన్ గన్‌.. బొమ్మ గన్‌గా మారింది. అతని ప్రదర్శన చూసి నా కళ్లను నేనే నమ్మలేకపోయా. కానీ ఓ విషయంపై స్పష్టత వచ్చింది. భవిష్యత్‌లో లీగ్‌ మార్కెట్‌లో అతన్ని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రారు'' అని సెహ్వాగ్ అన్నాడు.

అందుకే టీ20, వన్డే సిరీస్‌లకు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదు: సౌరవ్ గంగూలీఅందుకే టీ20, వన్డే సిరీస్‌లకు రోహిత్ శర్మను ఎంపిక చేయలేదు: సౌరవ్ గంగూలీ

Story first published: Friday, November 13, 2020, 22:07 [IST]
Other articles published on Nov 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X