న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్రిదితో వెల్లడి: సెహ్వాగ్‌ను భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా?

 Virender Sehwag reveals the name of the only bowler he was scared of

హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఓ బౌలర్ భయపెట్టాడంట. తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో కలిసి యూసీ బ్రౌజర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సెహ్వాగే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

"నేను భయపడ్డ బౌలర్‌ ఎవరైనా ఉన్నారంటే అతడి పేరు షోయబ్‌ అక్తర్‌. ఏ బంతిని పాదానికి విసురుతాడో, ఏ బంతిని తలకు విసురుతాడో ఎవరికీ తెలియదు. అతడు నా తలకు ఎన్నో బంతులు సంధించాడు . అక్తర్‌ను చూసి భయపడేవాడిని" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

 పాక్‌తో ఆడటమంటే నాకెంతో ఇష్టం

పాక్‌తో ఆడటమంటే నాకెంతో ఇష్టం

"అయితే అక్తర్ బౌలింగ్‌లో పరుగులు చేస్తే మాత్రం సరదాగా ఉండేది. పాక్‌తో ఆడటమంటే నాకెంతో ఇష్టం. నా ప్రియమైన ప్రత్యర్థి జట్టు పాకిస్థానే" అని సెహ్వాగ్ వెల్లడించాడు. మరోవైపు షాహిద్ అఫ్రిది మాత్రం తాను ఏ బౌలర్‌నూ చూసి భయపడేవాడు కాదని చెప్పుకొచ్చాడు.

ఏ బౌలర్‌నూ చూసి భయపడలేదు

ఏ బౌలర్‌నూ చూసి భయపడలేదు

"ప్రత్యేకంగా ఏ బౌలర్‌నూ చూసి భయపడను. వీరేంద్ర సెహ్వాగ్‌కు బౌలింగ్‌ వేయడమంటే మాత్రం ఇబ్బందిగా ఉండేది. నా సిక్సర్లను చూసి రవిశాస్త్రి బూమ్‌ బూమ్‌ అఫ్రిదిగా పేరుపెట్టాడు" అని అఫ్రిది ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. తమ తమ కెరీర్‌లో సాధించిన అద్భుతమైన విజయాలతో పాటు గుర్తుండిపోయే సందర్భాలను సైతం అభిమానులతో పంచుకున్నారు.

నా జీవితంలో గుర్తుండిపోయే సంఘటనలివే

నా జీవితంలో గుర్తుండిపోయే సంఘటనలివే

2009 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలవడం ఎప్పటికీ తన క్రీడా జీవితంలో గుర్తుండిపోయే సంఘటలని సెహ్వాగ్ తెలిపాడు. దక్షిణాఫ్రికాలో అనుభవం లేని యువజట్టుగా వెళ్లి టీ20 వరల్డ్ కప్‌ని నెగ్గామని, ఇక, 2011లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఆతిథ్య దేశంగా ట్రోఫీ కైవసం చేసుకున్నామని సెహ్వాగ్ తెలిపాడు.

టీ20 వరల్డ్ కప్ గెలవడం ఎప్పటికీ గుర్తుంచుకుంటా

టీ20 వరల్డ్ కప్ గెలవడం ఎప్పటికీ గుర్తుంచుకుంటా

ఇక, ఆఫ్రిది విషయానికి వస్తే శ్రీలంక ఘటన జరిగిన తర్వాత 2009 టీ20 వరల్డ్ కప్ గెలవడం తానెప్పటికీ గుర్తుంచుకునే విషయమని అన్నాడు. 2009లో శ్రీలంక ఆటగాళ్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఘటనలో పాక్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు గాయపడిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, October 1, 2018, 17:21 [IST]
Other articles published on Oct 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X