న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రిస్ గేల్‌ను చివరి నిమిషంలో కొనుగోలు చేయడంపై సెహ్వాగ్

By Nageshwara Rao
Virender Sehwag explains Kings XI Punjab’s decision to buy Chris Gayle

హైదరాబాద్: టీ20 ఫార్మాట్‌లో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 30 బంతుల్లో సెంచరీ.. పది వేలకుపైగా పరుగులు.. ఈ గణాంకాలు చాలు టీ20ల్లో క్రిస్ గేల్ సత్తా ఏంటో చెప్పడానికి.

ఐపీఎల్ 2018: 8 జట్లకు చెందిన పూర్తి ఆటగాళ్ల వివరాలుఐపీఎల్ 2018: 8 జట్లకు చెందిన పూర్తి ఆటగాళ్ల వివరాలు

అంతటి ప్లేయర్‌ను ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఏ ఒక్క ప్రాంఛైజీ ఆసక్తి కనబర్చకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. వేలంలో తొలి రెండుసార్లు అమ్ముడుపోని గేల్‌ను.. రెండోరోజైన ఆదివారం చివరి రౌండ్‌లో మూడోసారి కనీస ధర అయిన రూ.2 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సొంతం చేసుకుంది.

38 ఏళ్ల క్రిస్ గేల్ ఏదో అద్భుతాలు చేస్తాడని పంజాబ్ జట్టు తీసుకోలేదని తాజాగా ఆ జట్టు మెంటార్, డైరెక్టర్ అయిన సెహ్వాగ్ చెప్పాడు. చివరి నిమిషంలో క్రిస్ గేల్‌ను కొనుగోలు చేయడానికి గల కారణాన్ని కూడా సెహ్వాగ్ చెప్పాడు. '38 ఏళ్ల వయసులో అతని నుంచి ఏ ఫ్రాంచైజీ అద్భుతాలు ఆశించలేదు. పంజాబ్ కూడా కేవలం ఓ బ్యాకప్ ఓపెనర్‌గా మాత్రమే గేల్‌ను తీసుకుంది. గేల్ టీమ్‌లో ఉన్నాడంటే చాలు. ఓ ఓపెనర్‌గా ఏ ప్రత్యర్థికైనా అతని నుంచి ముప్పు తప్పదు' అని సెహ్వాగ్ అన్నాడు.

ఐపీఎల్ 2018: వేలం తర్వాత రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు ఇదేఐపీఎల్ 2018: వేలం తర్వాత రాజస్థాన్ రాయల్స్ పూర్తి జట్టు ఇదే

అంతేకాదు గేల్‌ను అన్ని మ్యాచ్‌ల్లో ఆడించేది లేదని సెహ్వాగ్ చెప్పాడు. 'గేల్ బ్రాండ్‌ వాల్యూ అతనేంటో చెబుతుంది. ఈ ఫార్మాట్‌లో సక్సెసైన బ్యాట్స్‌మన్. అతన్ని ఓపెనింగ్ స్లాట్‌కు బ్యాకప్‌గా వినియోగించాలని అనుకుంటున్నాం' అని సెహ్వాగ్ చెప్పాడు. వేలంలో గేల్‌తో పాటు పంజాబ్ జట్టులో ఆరోన్ ఫించ్, మార్కస్ స్టోయినిస్, కేఎల్ రాహుల్, యువరాజ్‌ సింగ్, కరుణ్ నాయర్, మయంక్ అగర్వాల్‌లాంటి అద్భుత బ్యాట్స్‌మెన్ ఉన్నారు.

ఐపీఎల్ 2018 వేలం అనంతరం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు:
1. అక్షర్ పటేల్ (రూ.6.75 కోట్లు - Retained)
2. అశ్విన్ (రూ.7.6 కోట్లు)
3. యువరాజ్ సింగ్ (రూ.2 కోట్లు)
4. కరుణ్ నాయర్ (రూ.5.6 కోట్లు)
5. కేఎల్ రాహుల్ (రూ.11 కోట్లు)
6. డేవిడ్ మిల్లర్ (రూ.3 కోట్లు - RTM)
7. ఆరోన్ ఫించ్ (రూ.6.2 కోట్లు)
8. మార్కస్ స్టాయినిస్ (రూ.6.2 కోట్లు-RTM)
9. మయాంక్ అగర్వాల్ (రూ.కోటి)
10. అంకిత్‌సింగ్ రాజ్‌పుత్ (రూ.3 కోట్లు)
11. మనోజ్ తివారీ (రూ.కోటి)
12. మోహిత్ శర్మ (రూ.2.4 కోట్లు- RTM)
13. ముజీబ్ జర్దాన్ (రూ.4 కోట్లు)
14. బరిందర్ శరణ్ (రూ.2.2 కోట్లు)
15. అండ్రూ టై (రూ.7.2 కోట్లు)
16. అక్షదీప్ నాథ్ (రూ.కోటి)
17. బెన్ డ్వార్షుయిస్ (రూ.1.4 కోట్లు)
18. ప్ర‌దీప్ సాహు (రూ.20 ల‌క్ష‌లు)
19. మ‌యాంక్ దాగార్ (రూ.20 ల‌క్ష‌లు)
20. క్రిస్ గేల్ (రూ.2 కోట్లు)
21. మంజూర్ దార్ (రూ.20 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 19:36 [IST]
Other articles published on Jan 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X