న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ.. ఆ ఒక్క రికార్డు మాత్రం చేధించలేడు: సెహ్వాగ్

 Virender Sehwag backs Virat Kohli to break all batting records except this Sachin Tendulkar milestone

హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం.. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అన్ని రికార్డులను కోహ్లీ బద్దలుకొడతాడని పలువురు క్రీడా ప్రముఖులు నొక్కి చెప్తున్నా.. ఆ ఒక్క రికార్డు మాత్రం కోహ్లీ అధిగమించలేడని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఇన్ని రికార్డులు దాటుకోగల సత్తా ఉన్న కోహ్లీ.. సచిన్‌లాగా 200 టెస్టులు ఆడటం మాత్రమే కష్టమని.. ఆ రికార్డును చెరిపేయడం సాధ్యం కాదని సెహ్వాగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

24 ఏళ్ల వరకు క్రికెట్‌ ఆడుతూనే

24 ఏళ్ల వరకు క్రికెట్‌ ఆడుతూనే

ఒకవేళ ఆ రికార్డును కూడా దాటుకోవాలంటే అతను కనీసం 24సంవత్సరాల వరకు క్రికెట్‌ ఆడుతూనే ఉండాలని ఈ మాజీ ఓపెనర్‌ పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరికీ క్రికెట్‌లో సచిన్ నమోదు చేసిన రికార్డులన్నింటినీ కోహ్లీ దాటుకోగలడని నమ్మకం ఉంది. అది నిజమే. నేను కూడా దీని గురించి చాలాసార్లు మాట్లాడాను. కానీ పరుగుల విషయంలో ఇది సాధ్యం కావచ్చు.. కానీ, 200 టెస్టులాడటం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ క్రికెటర్‌కైనా సాధ్యం కాని పనేనంటూ సెహ్వాగ్‌ తెలిపాడు.

బౌలర్లు లేకపోవడంతోనే కోహ్లీ రికార్డులు

బౌలర్లు లేకపోవడంతోనే కోహ్లీ రికార్డులు

‘ప్రస్తుత క్రికెట్‌లో నాణ్యత గల బౌలర్లు లేకపోవడంతోనే కోహ్లీ వరుస రికార్డులు సృష్టిస్తున్నాడని చాలామంది అంటున్నారు. కానీ, ఇది సరైన వ్యాఖ్య కాదు. కోహ్లీలో ఒక ప్రత్యేకత ఉంది. అందుకే అతను నిలకడగా పరుగులు సాధిస్తూ వస్తున్నాడు.'

కోహ్లీ కెరీర్ అంతా సాఫీగా

కోహ్లీ కెరీర్ అంతా సాఫీగా

'నేను సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌, ద్రవిడ్‌.. వంటి ఆటగాళ్లతో ఆడాను. వారి ఆటను దగ్గర నుంచి చూశాను. వాళ్లు కూడా తమ కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నవారే. కానీ కోహ్లీ అలా కాదు. మొదటి నుంచి ఇప్పటివరకూ అతని కెరీర్‌ చూస్తే అంతా సాఫీగా కనిపిస్తుందని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

వాళ్లు ఉన్నా లేకపోయినా పర్వాలేదు:

వాళ్లు ఉన్నా లేకపోయినా పర్వాలేదు:

స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ వంటి కీలక ఆటగాళ్లు లేకున్నా.. ఆసీస్‌కు అది పెద్ద విషయమేమీ కాదు. వాళ్లు లేకపోయినా మిగతా ఆటగాళ్లు తమదైన శైలిలో అదే దూకుడు ప్రదర్శించగలరు. ప్రస్తుతం వారి టెస్టు జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ ఇప్పటికే అక్కడి ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన వారే. వారికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకున్నా.. భారతతో జరిగే పోరులో మంచి పోటీనే ఇవ్వగలరు.

Story first published: Sunday, November 11, 2018, 9:34 [IST]
Other articles published on Nov 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X