న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించిన సెహ్వాగ్, నెహ్రా.. సూర్యకు చాన్స్.. ధావన్‌కు దక్కని చోటు!

Virender Sehwag and Ashish Nehra predicts India’s Playing XI for T20 World Cup 2021, Suryakumar Yadav included
T20 World Cup 2021 India’s Playing XI Announced By Virender Sehwag & Ashish Nehra | Oneindia Telugu

న్యూఢిల్లీ: భారత్ వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా యూఏఈకి తరలి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లిన ఆతిథ్య హక్కులు మాత్రం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) దగ్గరే ఉన్నాయి. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్నీ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తుంది. తేదీలు ఖారారు చేసినా.. షెడ్యూల్ ప్రకటించలేదు. ఇక మెగాటోర్నీ కోసం క్రికెట్ దేశాలన్ని సమాయత్తం అవుతున్నాయి.

బెస్ట్ కాంబినేషన్స్‌తో బరిలో దిగేందుకు సమాయత్తం అవుతున్నాయి. మెగాటోర్నీల్లో వరుసగా విఫలమవుతున్న టీమిండియా సైతం ఈ సారి టైటిల్ లక్ష్యంగా సన్నాహకాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా యువ ఆటగాళ్ల సత్తా పరీక్షిస్తోంది. ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే మెగా టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపికపై కసరత్తులు చేస్తోంది.

నో ధావన్, అయ్యర్..

నో ధావన్, అయ్యర్..

మరోవైపు క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు సైతం తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ పేసర్ ఆశీష్ నెహ్రాలు ప్రపంచకప్‌ బరిలో దిగే భారత తుది జట్టును అంచనా వేసారు. శ్రీలంక పర్యటనలో దుమ్మురేపుతున్న సూర్యకుమార్ యాదవ్‌కు చోటు కల్పించిన ఈ దిగ్గజాలు.. జట్టులో రెగ్యూలర్ ఆటగాడైన శ్రేయస్ అయ్యర్‌ను విస్మరించారు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమీతో పాటు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను పక్కనపెట్టారు.

ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్

ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్

ఓపెనర్లుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను ఎంపిక చేసిన సెహ్వాగ్, నెహ్రా.. ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా కేఎల్ రాహుల్‌కు అవకాశమిచ్చారు. నాలుగో స్థానంలో విధ్వంసకర వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను.. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు. పరిమిత ఓవర్ల సిరీస్‌లో సూర్య అదరగొడుతున్న విషయం తెలిసిందే. దాంతోనే సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లను పక్కనపెట్టి మరి సూర్యకు అవకాశమిస్తారని తెలిపారు.

సుందర్‌కు చోటు..

సుందర్‌కు చోటు..

ఆల్‌రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లను తీసుకున్నారు. ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యా నిరాశపరుస్తున్నా.. అతని మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం కారణంగానే చోటు దక్కించుకుంటాడని తెలిపారు. జడేజా అన్ని విభాగాల్లో రాణిస్తాడని, సుందర్ కారణంగా బౌలింగ్‌లో డెప్త్ ఉంటుందన్నారు. అతను చాలా కట్టడిగా బౌలింగ్ చేస్తాడని చెప్పారు. ఏకైక స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కుతుందన్నసెహ్వాగ్, నెహ్రా.. జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లను ప్రధాన పేసర్లుగా ఎంచుకున్నారు. ఇటీవల ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన దీపక్ చాహర్‌ను సైతం విస్మరించారు.

సెహ్వాగ్, నెహ్రా టీ20 ప్రపంచకప్ టీమ్

సెహ్వాగ్, నెహ్రా టీ20 ప్రపంచకప్ టీమ్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

Story first published: Wednesday, July 28, 2021, 16:39 [IST]
Other articles published on Jul 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X