|
నా గుండెలో ఎప్పటికీ..
తాజాగా విరాట్ కోహ్లీ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఇన్నింగ్స్ తన జీవితంలో మరిచిపోలేనిదని, ఈ మ్యాచ్‌లోని తన ఎనర్జీ ఇంతకుముందు ఎప్పుడూ లేదని పేర్కొన్నాడు. అదో అద్భుతమైన సాయంత్రమని చెప్పిన విరాట్..తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ట్వీట్ చేశాడు. 'అక్టోబర్ 23, 2022 నాకు ప్రత్యేకమైన రోజు.
ఇది ఎప్పటికీ నా గుండెలో ఉండిపోతుంది. ఈ మ్యాచ్‌లో నాకు ఉన్న ఎనర్జీ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇది నాకు మాత్రమే దక్కిన అదృష్టవంతమైన సాయంత్రం'అని విరాట్ పేర్కొన్నాడు. దీనికి అందరికి ధన్యవాదాలు అనే ఏమోజితో పాటు ఆ మ్యాచ్ అనంతరం మైదానం వీడుతున్న తన ఫొటోను జత చేశాడు.
|
పాకిస్థాన్ ఫ్యాన్స్ సైతం..
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ కాగా.. 'నీకే కాదు మాకు కూడా ఇది అత్యద్భుమైన ఇన్నింగ్స్'అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. భారత అభిమానులే కాదు.. పాకిస్థాన్ ఫ్యాన్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. విరాట్ ఆల్‌టైమ్ గ్రెటెస్ట్ బ్యాటర్ అంటూ కొనియాడుతున్నారు. చిన్నప్పటి నుంచి విరాట్ ఆట చూస్తున్నామని, అతను మా దేశంపై విజయాలు సాధిస్తూనే ఉన్నాడని పేర్కొంటున్నారు. కొందరైతే ఇకనైన పరుగులు చేయడం ఆపాలని కోరుతున్నారు. హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో కొట్టిన రెండు సిక్స్‌లు ఎప్పటికీ మరిచిపోమని తెలిపాడు.

అక్టోబర్ అంటే పూనకమే..
విరాట్ కోహ్లీకి అక్టోబర్ 23వ తేదితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ డేట్ అతనికి బాగా కలిసొచ్చింది. 14 ఏళ్ల కెరీర్‌లో అక్టోబర్ 23నే అతను మూడు భారీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2011 అక్టోబర్ 23న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2015 అక్టోబర్ 22న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 138 పరుగులతో రాణించాడు. 2016 అక్టోబర్ 23న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 154 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2017 అక్టోబర్ 21న వెస్టిండీస్‌తో 140 పరుగులు చేసిన కోహ్లీ.. ఆ మరుసటి రోజే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 121 పరుగులు చేశాడు. 2018 అక్టోబర్ 24న వెస్టిండీస్‌పై 157 పరుగులతో అజేయంగా నిలిచాడు.

బంగ్లాదేశ్‌తో రీఎంట్రీ..
ప్రపంచకప్ 2022లో నాలుగు హాఫ్ సెంచరీలతో రాణించిన విరాట్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. కానీ టీమిండియా మాత్రం సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఈ మెగా టోర్నీ అనంతరం విశ్రాంతి తీసుకున్న విరాట్.. న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌తో విరాట్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఈ బ్రేక్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. బ్రేక్‌లో ఉన్నా జిమ్ చేయడం మాత్రం విరాట్ ఆపలేదు.