'సాప్ట్' గా తిరస్కరించాడు: కోట్లిస్తామన్నా వద్దన్న కోహ్లీ

Posted By:

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌కి ఇచ్చే ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాను పూర్తి ఫిట్‌గా ఉండడమేకాదు, సహచరులూ అదేస్థాయి ఫిట్‌నెస్‌తో ఉండాలని ఆశిస్తాడు. తమ ప్రకటనల్లో నటించేందుకు కోహ్లీకి కోట్ల రూపాయలు ఇచ్చేందుకు వాణిజ్య సంస్థలు పోటీపడతాయి.

అయితే ప్రకటనల విషయంలో కోహ్లి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఓ సాఫ్ట్‌ డ్రింక్‌ సంస్థతో కోట్ల రూపాయల విలువైన ఒప్పందానికి నో చెప్పాడు. ఈ విషయాన్ని కోహ్లీనే స్వయంగా వెల్లడించాడు. ఫిట్‌నెస్‌ను కాపాడుకొనేందుకు డైట్‌ విషయంలో కోహ్లీ ఎంతో నిక్కచ్చిగా ఉంటాడనే విషయం తెలిసిందే.

 Virat Kohli Turns Down Multi-Crore Soft Drink Deal, Says He Won't Endorse What He Doesn't Consume

అందుకే తాను సాఫ్ట్‌డ్రింక్స్‌ జోలికి పోనని తేల్చి చెప్పాడు. అందుకే తాను తీసుకోని వాటి గురించి ప్రచారం చేయడం సరికాదని భావించిన కోహ్లీ... కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశమున్నా ఒప్పందం చేసుకోవడానికి అంగీకరించలేదు. కోహ్లీ తీసుకున్న నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంటుంది.

నిజాని కోహ్లీ ఎంత బిజీ షెడ్యూల్‌ అయినా సరే జిమ్‌కు వెళ్లడం మానడు. ఇటీవలి శ్రీలంక పర్యటనకు ముందు భారత జట్టుకు 'యోయో' ఫిట్‌నెస్‌ టెస్ట్‌ నిర్వహిస్తే అందులో కోహ్లీకి వచ్చిన స్కోరు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకోవాలంటే 19.5 స్కోరు వస్తే చాలు. కానీ కోహ్లీకి వచ్చిన స్కోరు 21. దీనిని బట్టే తెలుసుకోవచ్చు కోహ్లీ ఎంత ఫిట్‌గా ఉన్నాడో.

Story first published: Friday, September 15, 2017, 11:44 [IST]
Other articles published on Sep 15, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి