న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుజారా.. నువ్వు ఉరుకాల్సిందే: కోహ్లీ

Virat Kohli Teases Cheteshwar Pujara With First Session After Lockdown
Virat Kohli Hilariously Teases Cheteshwar Pujara

న్యూఢిల్లీ: కరోనా పుణ్యమా క్రీడాటోర్నీలు రద్దవ్వడంతో పాటు.. లాక్‌డౌన్ విధించడంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్యంగా ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే వ్యాయమాలు చేస్తున్నారు. ఇంటి పనులు చేస్తూ వారి కుటుంబాలకు సాయంగా ఉంటున్నారు. తమ జీవితంలో ఇంత ఖాళీ సమయం గడపని స్టార్ క్రికెటర్లు.. తమకు తోచిన విధంగా ఆస్వాదిస్తున్నారు.

తాజాగా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ లాక్‌డౌన్ ఉద్దేశించి వ్యంగ్యస్త్రాలు సంధించాడు. లాక్‌డౌన్ తర్వాత జరిగే తొలి మ్యాచ్ ఫస్ట్ సెషన్ ఎలా ఉంటుందో ఊహించి.. తన సహచర ఆటగాడు చతేశ్వర్ పుజారను ప్రస్తవిస్తూ ట్వీట్ చేశాడు. దీనికి 2018లో ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్ట్ నాటి ఫొటోను ఒకటి జత చేసి నవ్వులు పూయించాడు.

ఆ టెస్ట్‌లో పుజారా స్లిప్‌లో ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకుంటుండగా.. పక్కనే ఉన్నా పుజారా కెప్టెన్నే చూస్తున్నాడు. ఈ ఫొటోకు విరాట్..'లాక్‌డౌన్ తర్వాత ఫస్ట్ సెషన్‌లో ఈ పరిస్థితి ఎదురైతే.. పుజారా బంతి కోసం నువ్వు ఉరాకాల్సిందే'అని వ్యంగ్య ఏమోజీలతో క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. లాక్ డౌన్ వల్ల ఆటకు దూరమవడంతో క్లిష్టమైన క్యాచ్‌లు పట్టడం కష్టమేననే ఉద్దేశంతో కోహ్లీ ట్వీట్ చేశాడు.

దీనికి పుజారా కూడా చాలా ఫన్నిగా బదులిచ్చాడు. 'ఒంటి చేత్తో ఎవరు పట్టమంటున్నారు కెప్టెన్.. రెండు చేతులతో బంతిని అందుకో.. నేను పరుగెత్తాల్సిన అవసరం ఉండదు'అని కామెంట్ చేశాడు. దీనికి కోహ్లీ సూపర్... అలాగే అనే ఏమోజీలతో బదులిచ్చాడు. ఇక మహ్మద్ షమీ అలాంటి అవకాశం రాదులే.. అని కామెంట్ చేశాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సైతం తనదైన శైలిలో బదులిచ్చాడు. 'చలికాలంలో చల్లగా ఉంటుంది కాబట్టి నువ్వు ఇలాంటి క్యాచ్‌లు అందుకోలేవ్ విరాట్'అని కామెంట్ చేశాడు.

ధోనీ, కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలో ఉన్న తేడా ఇదే: ఎమ్మెస్కేధోనీ, కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలో ఉన్న తేడా ఇదే: ఎమ్మెస్కే

Story first published: Wednesday, May 6, 2020, 14:40 [IST]
Other articles published on May 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X