న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వేట మొదలు పెట్టిన విరాట్ కోహ్లీ: టెస్ట్ కోసం నెట్ ప్రాక్టీస్: కోన భరత్ డెబ్యూ?

Virat Kohli starts practice at Brabourne Stadium ahead of the Test series against New Zealand

ముంబై: భారత క్రికెట్ జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ..రంగంలో దిగాడు. సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ ఆడిన అతను కొంత విరామం తరువాత మళ్లీ బరిలో దిగాడు. భారత్‌లో పర్యటిస్తోన్న న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంది టీమిండియా. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న తరువాత విరాట్ కోహ్లీ కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. తొలి టెస్ట్‌లో ఆడట్లేదు. రెండో టెస్ట్‌లో విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దీనికోసం నెట్ ప్రాక్టీస్ మొదలు పెట్టేశాడు.

టీ20 సిరీస్‌కూ డుమ్మా..

భారత జట్టు టీ20 ఫార్మట్ కేప్టెన్ హోదా నుంచి విరాట్ కోహ్లీ వైదొలగిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ అతని స్థానాన్ని భర్తీ చేశాడు. న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లోనూ కోహ్లీ అందుబాటులో లేడు. విశ్రాంతి కోసం అతను జట్టుకు దూరం అయ్యాడు. ఇదే కారణంతో ఎల్లుండి కాన్పూర్‌లో మొదలయ్యే తొలి టెస్ట్‌లో కూడా ఆడట్లేదు. రెండో టెస్ట్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. ముంబైలోని బ్రాబర్న్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాడు కోహ్లీ.

శ్రేయాస్ అయ్యర్ డెబ్యూ

శ్రేయాస్ అయ్యర్ డెబ్యూ

విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో అజింక్య రహానె.. ఈ తొలి టెస్ట్‌కు కేప్టెన్‌గా వ్యవహరిస్తాడు. శ్రేయాస్ అయ్యర్ ఈ మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా అతను వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్‌కే పరిమితం అయ్యాడు. ఇక న్యూజిలాండ్‌పై కాన్పూర్‌లో తలపడే టీమిండియా తుది జట్టులో అతనికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. టీ20, వన్డే ఫార్మట్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న శ్రేయాస్.. ఇక టెస్టుల్లో ఎలా రాణిస్తాడనేది ఆసక్తి రేపుతోంది.

 రోహిత్ శర్మ దూరం..

రోహిత్ శర్మ దూరం..

కాగా, ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడట్లేదు. ఈ సారి అతను రెస్ట్ తీసుకోనున్నాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో టీ20 సిరీస్‌ను మొదటగా షెడ్యూల్ చేసినందున తప్పనిసరిగా ఆడాల్సి వచ్చింది. అజింక్య రహానె, విరాట్ కోహ్లీ టెస్ట్ జట్టులో చేరగా.. రోహిత్ శర్మ సెలవుల్లో వెళ్లాడు. రోహిత్ శర్మ కేప్టెన్సీలో భారత జట్టు ఈ మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను క్వీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను గెలుచుకున్నాడు హిట్ మ్యాన్.

 తొలి టెస్ట్ స్క్వాడ్ ఇదే

తొలి టెస్ట్ స్క్వాడ్ ఇదే

ఎల్లుండి కాన్పూర్‌లో ఆరంభం అయ్యే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, చేతేశ్వర్ పుజారా, శ్రేయాస్ అయ్యర్, అజింక్య రహానె (కేప్టెన్), కేఎస్ భరత్, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్‌ను టెస్ట్ స్క్వాడ్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. తొలిమ్యాచ్‌లో కేఎస్ భరత్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

Story first published: Tuesday, November 23, 2021, 10:50 [IST]
Other articles published on Nov 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X