న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అక్ష‌ర్‌తో హార్దిక్ ఇంట‌ర్వ్యూ.. మధ్యలో దూరి కోహ్లీ ఏమన్నాడంటే? గుజ‌రాతీ భాష‌లో (వీడియో)

Virat Kohli speaks Gujarati during Axar Patels interview with Hardik Pandya

అహ్మాద్దాబాద్: లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ (6/38, 5/32) విజృంభించడంతో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్‌ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆరు సెషన్ల లోపే ముగిసిన డే/నైట్‌ టెస్టులో కోహ్లీసేన 10 వికెట్ల తేడాతో గురువారం గెలుపొందింది. ఫలితంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ రేసులో ముందడుగు వేసింది. ఈ పరాజయంతో ఇంగ్లండ్‌ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌ దారులు మూసుకుపోగా.. కోహ్లీసేన చివరి టెస్టును కనీసం 'డ్రా' చేసుకున్నా లార్డ్స్‌లో న్యూజిలాండ్‌తో తుది పోరులో తలపడనుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1తో నిలిచింది.

అక్ష‌ర్‌తో హార్దిక్ ఇంట‌ర్వ్యూ:

అయితే గురువారం మ్యాచ్ ముగిసిన త‌ర్వాత‌.. లోక‌ల్ స్పిన్న‌ర్ అక్ష‌ర్ ప‌టేల్‌ను ఆల్‌రౌండ‌ర్ హార్డిక్ పాండ్యా ఇంట‌ర్వ్యూ చేశాడు. మ్యాచ్‌లో 11 వికెట్లు తీసిన అక్ష‌ర్‌ను హార్దిక్ మెచ్చుకున్నాడు. రెండ‌వ ఇన్నింగ్స్‌లో అక్ష‌ర్ ఆరు వికెట్లు తీశాడు. స్వంత ప్రేక్ష‌కుల ముందు ఆడ‌డం సంతోషంగా ఉంద‌ని అక్ష‌ర్ అన్నాడు. అయితే ఇంట‌ర్వ్యూ జ‌రుగుతున్న స‌మ‌యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. కోహ్లీని పాండ్యా ఇంట్ర‌డ్యూస్ చేస్తున్న స‌మ‌యంలో భార‌త కెప్టెన్ ఓ ఫ‌న్నీ కామెంట్ చేశాడు.

ఏ బాపు తారి బౌలింగ్ క‌మాల్ చే

ఏ బాపు తారి బౌలింగ్ క‌మాల్ చే

గుజ‌రాతీ భాష‌లో అక్ష‌ర్ ప‌టేల్‌ను విరాట్ కోహ్లీ గ్రీట్ చేశాడు. 'ఏ బాపు తారి బౌలింగ్ క‌మాల్ చే' అని కోహ్లీ అన్నాడు. అంటే.. అక్ష‌ర్ నువ్వు అద్భుతంగా బౌలింగ్ చేశావంటూ కోహ్లీ గుజ‌రాతీలో అన్నాడు. భార‌త కెప్టెన్ కోహ్లీ చేసిన కామెంట్‌తో హార్డిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్ ఇద్ద‌రు విర‌గ‌బ‌డి న‌వ్వారు. వెంటనే కోహ్లీ కూడా నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన ఫాన్స్ తమదైన శైలిలో బదులిస్తున్నారు.

29 టెస్టుల్లో 22 విజయాలు

29 టెస్టుల్లో 22 విజయాలు

భారత్‌ తరఫున అత్యంత విజయవంతమైన సారథిగా ఇప్పటికే విరాట్‌ కోహ్లీ ఘనత సాధించాడు. కోహ్లీ 35 విజయాలు అందుకున్నాడు. తాజాగా ఇంగ్లండ్‌పై విజయంతో ఎంఎస్‌ ధోనీ రికార్డు బద్దలు కొట్టాడు. గతంలో సొంతగడ్డపై అత్యధిక విజయాల రికార్డు మహీ పేరుతో ఉండేది. అతడి సారథ్యంలో భారత్ భారత గడ్డపై 30 మ్యాచుల్లో 21 విజయాలు అందుకుంది. ఇప్పుడు కోహ్లీసేన 29 టెస్టుల్లో 22 విజయాలు నమోదు చేయడం గమనార్హం.

డే/నైట్‌ టెస్టులో అత్యధిక వికెట్లు

డే/నైట్‌ టెస్టులో అత్యధిక వికెట్లు

గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ అంచనాలకు మించి రాణించాడు. అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్ల రికార్డు సాధించిన అక్షర్‌ మొతేరాలో 10+ వికెట్ల ఘనత సొంతం చేసుకున్నాడు. డే/నైట్‌ టెస్టులో 11/70తో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగానూ అతడు రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 2018/19లో శ్రీలంకపై ప్యాట్‌ కమిన్స్‌ 10/62, 2016/17లో పాక్‌పై దేవేంద్ర బిషూ 10/174 ఈ ఘనత సాధించారు. అయితే అక్షర్‌వే ఇక్కడ మెరుగైన గణాంకాలు.

Story first published: Friday, February 26, 2021, 13:27 [IST]
Other articles published on Feb 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X