న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కష్టాల్లో టీమిండియా: నాలుగో హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ

Virat Kohli Smashes Another Half-Century, India 4 Down

హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 140 పరుగుల వద్ద కేదార్ జాదవ్ రూపంలో నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ 29వ ఓవర్ ఐదో బంతికి కేదార్ జాదవ్(7) పరుగుల వద్ద కీమర్ రోచ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ షాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ 55 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీకి ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. అంతకముందు విజయ్ శంకర్(14) పరుగుల వద్ద కీమర్ రోచ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ షాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

కాగా, ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తృటిలో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. 64 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు చేసిన రాహుల్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. విండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌ వేసిన 21 ఓవర్‌ నాలుగో బంతికి రాహుల్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 98 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ను నష్టపోయింది.

రోహిత్‌ ఔటైన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యతను తీసుకున్న రాహుల్‌ హోల్డర్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

1
43677

భారత్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా కీమర్ రోచ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మ బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్యలోంచి కీపర్‌ షాయ్‌ హోప్‌ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై విండీస్‌ ఆటగాళ్లు అప్పీల్‌కు వెళ్లగా ఫీల్డ్‌ అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. అయితే దీనిపై విండీస్‌ రివ్యూ కోరగా అందులో భారత్‌కు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది.

అయితే, రోహిత్ శర్మది ఔటా.. నాటౌటా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేని క్రమంలో థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. ఇది వివాదాస్పదంగా మారింది.

ప్రపంచ రికార్డు నెలకొల్పిన కోహ్లీ
మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇటీవలే ఈ ప్రపంచకప్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా 11వేల పరుగుల మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు తక్కువ ఇన్నింగ్స్‌లో 20 వేల పరుగుల మార్కును చేరుకున్న వారిలో సచిన్, బ్రియాన్ లారాలు అగ్రస్థానంలో ఉన్నారు. 453 ఇన్నింగ్స్‌లో వీరిద్దరూ ఆ మార్కును చేరుకోగా.... ఆ తర్వాత 468 ఇన్నింగ్స్‌లతో రికీ పాంటింగ్ ఉన్నాడు. అయితే, కోహ్లీ మాత్రం కేవలం 417 ఇన్నింగ్స్‌లోనే ఈ మార్క్‌ను అందుకున్నాడు.

{headtohead_cricket_3_8}

Story first published: Thursday, June 27, 2019, 17:46 [IST]
Other articles published on Jun 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X