న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గిల్‌క్రిస్ట్‌తో కెప్టెన్ కోహ్లీ ముచ్చట్లు

India vs Australia 2018-19 : Virat Kohli,Gil Christ Has Funny Talks On Feild During Practice
Virat Kohli Shares A Light Moment With Adam Gilchrist During Practice

బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా బుధ‌వారం జ‌రిగే మొద‌టి టీ20తో సిరీస్‌ను ఆరంభం చేయనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయ‌ర్లు సోమవారం కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఆదివార‌మే గ‌బ్బా స్టేడియం వేదికగా తొలి రోజులో భాగంగా ట్రైనింగ్ సెష‌న్‌లో పాల్గొన్నారు. రెండో రోజు కూడా కోహ్లీ సేన నెట్స్‌లో పాల్గొంది. మాజీ ఆసీస్ వికెట్ కీప‌ర్ గిల్‌క్రిస్ట్‌తో కోహ్లీ కొంత సేపు స‌ర‌దాగా మాట్లాడారు. ఆ ఫోటోల‌ను బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.

కోహ్లీతో పాటు ధావ‌న్‌, రాహుల్‌లు కూడా

కోహ్లీతో పాటు ధావ‌న్‌, రాహుల్‌లు కూడా కొంత సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బౌల‌ర్ బుమ్రా కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయ‌డం విశేషం. బుధవారం ఆరంభమయ్యే టీ20 సిరీస్‌లో తాము కేవలం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మీద దృష్టిపెడితే సరిపోదని ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌నైల్‌ అన్నాడు. భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సైతం ప్రమాదకర ఆటగాడే అని చెప్పాడు.

మరోసారి అదే తరహాలో దెబ్బ తీసేందుకు

మరోసారి అదే తరహాలో దెబ్బ తీసేందుకు

‘రోహిత్‌ నమ్మశక్యం కాని ఆటగాడు. అతనేంటో తన రికార్డులతోనే చాటి చెప్తూ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాడు. గతంలో అతడిపై మేం బాగానే విజయవంతమైయ్యాం. కొత్త బంతితో ఇబ్బంది పెట్టాం. చివరగా మాతో ఆడినపుడు బెరెన్‌డార్ఫ్‌.. రోహిత్‌ను ఔట్‌ చేశాడు. మరోసారి అదే తరహాలో అతడిని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నాం' అని కౌల్టర్‌నైల్‌ అన్నాడు.

బాల్‌ టాంపరింగ్‌.. ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బే

బాల్‌ టాంపరింగ్‌.. ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బే

ఆస్ట్రేలియాలో గెలవడానికి ఇంతకంటే మంచి తరుణం మరోటి లేదన్నది మాజీలు, విశ్లేషకుల మాట. ప్రస్తుతమున్నంత బలహీనంగా కంగారూ జట్టు గతంలో ఎప్పుడూ లేదు. ఆ దేశ క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత పేలవ దశ నడుస్తోందిప్పుడు. ఈ ఏడాది ఆరంభంలో బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్‌ను గట్టి దెబ్బే తీసింది. స్టీవెన్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌లపై నిషేధం పడటంతో జట్టు బలహీనపడింది. టాంపరింగ్‌ వివాదం మొత్తం జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది.

భారత్‌ను ఓడించి తిరిగి ఫామ్‌ అందుకోవాలని

భారత్‌ను ఓడించి తిరిగి ఫామ్‌ అందుకోవాలని

సొంతగడ్డపై ఆస్ట్రేలియాను అంత తక్కువ అంచనా వేయలేం. తమ గడ్డపై సరైన రికార్డు లేని భారత్‌ను ఓడించి తిరిగి ఫామ్‌ అందుకోవాలని ఆ జట్టు చూస్తోంది. వన్డే ప్రపంచకప్‌ తమ స్థాయిని నిలబెట్టుకోవడానికి ఇదే సరైన సమయమని వేచి చూస్తోంది. సాధారణంగా ఆస్ట్రేలియాలో భారత పర్యటన టెస్టులతోనే మొదలవుతుంది కానీ.. ఈసారి కొంచెం భిన్నం. ముందు టీ20 సిరీస్‌ జరగనుంది. తర్వాత టెస్టులు ఆడి.. చివరగా వన్డే సిరీస్‌లో తలపడుతుంది టీమిండియా.

Story first published: Tuesday, November 20, 2018, 9:03 [IST]
Other articles published on Nov 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X