న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాంటింగ్, సచిన్‌లను కోహ్లీ దాటేనా?: ఒక్క సెంచరీతో రెండు రికార్డులు బద్దలు!

India vs Australia 2nd ODI: Virat Kohli set to break Ponting’s record, equal Sachin’s two others with 1 century in Rajkot

హైదరాబాద్: తొలి వన్డేలో ఓటమి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియాతో జరిగే రెండో టీ20లో తిరిగి మూడో స్థానంలోనే బరిలోకి వచ్చేలా చేసింది. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో క్రీజులోకి రావడం జట్టుకు ప్రయోజనం కలిగించకపోగా... ఓ ఘోర పరాజయానికి కారణమైంది.

ఈ నేపథ్యంలో రాజ్‌కోట్‌ వేదికగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో వన్డేలో కోహ్లీ తను ఎంతగానో ఇష్టపడే మూడో స్థానానికి తిరిగి వెళ్లేలా చేసింది. మూడు వన్డేల సిరిస్‌లో టీమిండియా నిలవాలంటే రెండో వన్డేలో కచ్చితంగా గెలిచి తీరాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరిస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి.

సిగ్గు చేటు.. ధోనికి కాంట్రాక్ట్ ఇవ్వరా?: బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్సిగ్గు చేటు.. ధోనికి కాంట్రాక్ట్ ఇవ్వరా?: బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

టీమిండియాకు చావో రేవో

టీమిండియాకు చావో రేవో

టీమిండియాకు రెండో వన్డే చావో-రేవో మ్యాచ్‌ కావడంతో అన్ని విభాగాల్లోనూ సత్తాచాటాలని కసరత్తు చేస్తోంది. అదే సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. ఇందులో ఒకటి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డు కాగా... రెండోది క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ది.

సెంచరీతో రెండు రికార్డులు బద్దలు

సెంచరీతో రెండు రికార్డులు బద్దలు

ఈ రెండు రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాలంటే మూడో స్థానంలో బరిలోకి దిగాల్సిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ చేసిన సెంచరీల సంఖ్య 41. కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి కోహ్లీ సమంగా ఉన్నాడు.

యార్క్‌షైర్‌కు ఆడే నాలుగో భారత ఆటగాడిగా రవిచంద్రన్ అశ్విన్

పాంటింగ్ రికార్డుని అధిగమించనున్న కోహ్లీ

పాంటింగ్ రికార్డుని అధిగమించనున్న కోహ్లీ

రాజ్‌కోట్ వేదికగా జరిగే రెండో వన్డేలో విరాట్ కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే రికీ పాంటింగ్ రికార్డుని బద్దలు కొడతాడు. విరాట్ కోహ్లీ(169 మ్యాచ్‌ల్లో 41 సెంచరీలు), పాంటింగ్(324 మ్యాచ్‌ల్లో 41) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండగా... ఈ జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌(286 మ్యాచ్‌ల్లో 33 సెంచరీలు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

సచిన్ రికార్డుని సమం చేసేనా?

సచిన్ రికార్డుని సమం చేసేనా?

మరోవైపు రాజ్ కోట్‌లో కోహ్లీ సెంచరీ సాధిస్తే సచిన్ రికార్డుని సమం చేస్తాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8 సెంచరీలు సాధించగా... సచిన్‌ టెండూల్కర్‌(9 సెంచరీలు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆసీస్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా సచిన్ రికార్డుని సమం చేసేందుకు కోహ్లీ సెంచరీ దూరంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు!

ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు!

సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ తర్వాత ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన మూడవ భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీనే. రోహిత్ శర్మ (60.20), ఎబి డివిలియర్స్ (59.52), డుప్లెసిస్ (54.00)ల తర్వాత ఆస్ట్రేలియాపై ఉత్తమ బ్యాటింగ్ సగటును కలిగి ఉన్న నాలుగో బ్యాట్స్‌మెన్‌ విరాట్ కోహ్లీనే.

Story first published: Thursday, January 16, 2020, 17:20 [IST]
Other articles published on Jan 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X