న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6 పరుగుల దూరంలో: సచిన్ రికార్డ్‌పై కన్నేసిన విరాట్ కోహ్లీ

By Nageshwara Rao
virat kohli set to break sachin tendulkars another test record

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మరో రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి సౌతాంప్టన్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుపై కోహ్లీ కన్నేశాడు.

ఇంతకీ కోహ్లీ అధిగమించబోయే సచిన్ రికార్డు ఏంటని అనుకుంటున్నారా? టెస్టుల్లో ఆరు వేల పరుగులు. నాలుగో టెస్టుతో సచిన్ టెండూల్కర్ ఆరు వేల పరుగుల రికార్డుని బద్దలు కొట్టడానికి కోహ్లీ సిద్ధమయ్యాడు. కోహ్లీ ప్రస్తుతం టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయికి ఆరు పరుగుల దూరంలో ఉన్నాడు.

1
42377
118 ఇన్నింగ్స్‌ల్లో 5994 పరుగులు చేసిన కోహ్లీ

118 ఇన్నింగ్స్‌ల్లో 5994 పరుగులు చేసిన కోహ్లీ

ఇప్పటివరకు 69 టెస్టులాడిన విరాట్ కొహ్లీ 118 ఇన్నింగ్స్‌ల్లో 5994 పరుగులు చేశాడు. సౌతాంప్టన్ టెస్ట్‌తో విరాట్ కోహ్లీ ఆరు వేల పరుగుల మార్క్ దాటనున్నాడు. సచిన్ టెండూల్కర్ 120 ఇన్నింగ్స్‌ల్లో 6వేల పరుగుల మార్క్‌ని అందుకోగా కోహ్లీ కేవలం 119 ఇన్నింగ్స్‌ల్లోనే ఆరువేల పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు.

అగ్రస్థానంలో ఆల్ టైమ్ గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్

అగ్రస్థానంలో ఆల్ టైమ్ గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్

అంతర్జాతీయ టెస్టుల్లో అత్యంత వేగంగా అతికొద్ది ఇన్నింగ్స్‌ల్లోనే ఆరు వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియన్ ఆల్ టైమ్ గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్రాడ్‌మన్ కేవలం 68 ఇన్నింగ్స్‌లోనే టెస్ట్‌ల్లో ఆరువేల పరుగుల మైలురాయిని అధిగమించాడు.

భారత్ తరుపున సునీల్ గవాస్కర్

భారత్ తరుపున సునీల్ గవాస్కర్

ఇక, టెస్టుల్లో అతి తక్కవ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్న భారత క్రికెటర్‌గా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్‌ నిలిచాడు. సునీల్ గవాస్కర్ 117 ఇన్నింగ్స్‌‌ల్లో 6వేల పరుగులు పూర్తి చేశాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ఆరు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 10వ స్థానంలో ఉన్నాడు.

కోహ్లీ మరో 6 పరుగులు చేస్తే 6వేల పరుగులు

కోహ్లీ మరో 6 పరుగులు చేస్తే 6వేల పరుగులు

సచిన్ తర్వాత ఈ జాబితాలో భారత మాజీ క్రికెటర్లు వీరేందర్ సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్‌లు వరుసగా 12,13 స్థానాల్లో ఉన్నారు. 123 ఇన్నింగ్స్‌లతో సెహ్వాగ్, 125 ఇన్నింగ్స్‌లతో రాహుల్ ద్రావిడ్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. సౌతాంప్టన్ టెస్టులో కోహ్లీ మరో 6 పరుగులు చేస్తే 6వేల పరుగుల మార్క్ దాటితే 119 ఇన్నింగ్స్‌లతో ఈ జాబితాలో సచిన్‌ను వెనక్కునెట్టి 10వ స్థానంలో నిలుస్తాడు.

మరో 104 పరుగులు సాధిస్తే.. కెప్టెన్‌గా 4 వేల పరుగులు

మరో 104 పరుగులు సాధిస్తే.. కెప్టెన్‌గా 4 వేల పరుగులు

అంతేకాదు మరో 104 పరుగులు సాధిస్తే.. కెప్టెన్‌గా 4 వేల పరుగుల మైలురాయిని కూడా కోహ్లీ అందుకుంటాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న విరాట్ కొహ్లీ సౌతాంప్టన్ టెస్టులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టగలుగుతాడా లేదా అని క్రికెట్ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Thursday, August 30, 2018, 11:18 [IST]
Other articles published on Aug 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X