న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RCB: ఆ క్యాచ్ పట్టిఉంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది: కోహ్లీ

Virat kohli says If Kane Williamson’s catch was taken, it would have been change the game

అబుదాబి: ఐపీఎల్ 2020లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ అఖరి ఓవర్‌లో సన్‌రైజర్స్ విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. సునాయాస లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 19.4 ఓవర్లలోనే ఛేదించింది. హాఫ్ సెంచరీతో సన్‌రైజర్స్‌ని గెలిపించిన కేన్ విలియమ్సన్ (50: 44 బంతుల్లో 2x4, 2x6)కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డ్ లభించింది.

పడిక్కల్ బ్యాలెన్స్ తప్పడంతో:

పడిక్కల్ బ్యాలెన్స్ తప్పడంతో:

ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ తన వ్యక్తిగత స్కోరు 37 వద్దే పెవిలియన్ చేరాల్సింది. సన్‌రైజర్స్ విజయానికి 16 బంతుల్లో 27 పరుగులు అవసరమైన దశలో బెంగళూరు పేసర్ నవదీప్ సైనీ వేసిన ఫుల్ టాస్ బంతిని డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు విలియమ్సన్. సిక్స్‌గా వెళ్తున్న ఆ బంతిని గాల్లోకి ఎగిరిన దేవదత్ పడిక్కల్ క్యాచ్‌గా అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ తప్పడంతో బౌండరీ లైన్‌ని తొక్కుతానని గ్రహించిన పడిక్కల్.. బంతిని మైదానంలోకి విసిరాడు. ఆ తర్వాత బౌండరీ లైన్‌పై పాదం ఉంచి బ్యాలెన్స్ తీసుకుని మళ్లీ మైదానంలోకి వచ్చాడు. అయితే అప్పటికే బంతి కిందపడిపోయింది. దీంతో క్యాచ్ అందుకోవడంలో అతడు విఫలమయ్యాడు.

 ఆ క్యాచ్ పట్టిఉంటే:

ఆ క్యాచ్ పట్టిఉంటే:

దేవదత్ పడిక్కల్.. కేన్ విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఇదే విషయాన్ని బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. 'తక్కువ స్కోర్ల మ్యాచ్ ఇది. ఒకవేళ మేము క్యాచ్ రూపంలో కేన్ విలియమ్సన్ వికెట్‌ని తీసి ఉంటే.. మ్యాచ్ మరోలా ఉండేది' అని కోహ్లీ పేర్కొన్నాడు. క్యాచ్ సమయానికి సన్‌రైజర్స్ ఆటగాళ్లు విలియమ్సన్, హోల్డర్ ఒత్తిడిలోనే ఉన్నారు. ఒకవేళ విలియమ్సన్ ఔట్ అయిఉంటే.. కచ్చితంగా సన్‌రైజర్స్ ఒత్తిడిలో పడేదే.

 అయ్యర్ క్యాచ్‌ని అద్భుతంగా:

అయ్యర్ క్యాచ్‌ని అద్భుతంగా:

ఈ సీజన్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ క్యాచ్‌ని ఇదే తరహాలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న దేవదత్ పడిక్కల్ అద్భుతంగా అందుకున్నాడు. తొలుత క్యాచ్ పట్టి.. బ్యాలెన్స్ కోల్పోతుండటంతో దాన్ని గాల్లోకి ఎగురవేసి బౌండరీ లైన్‌ వెలుపలికి వెళ్లి.. ఆ తర్వాత బంతిని క్యాచ్‌గా అందుకున్నాడు. కానీ గతరాత్రి మ్యాచ్ ఒత్తిడి కారణంగా పడిక్కల్ కాస్త ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.

తగినన్ని పరుగులు చేయలేదు:

తగినన్ని పరుగులు చేయలేదు:

'మేము బ్యాటింగ్‌లో తగినన్ని పరుగులు చేయలేదు. హైదరాబాద్ బౌలర్లపై ఒత్తిడి పెంచేలా మా బ్యాటింగ్ లేదు. బౌలర్లు కీలక వికెట్లు పడగొట్టి మమ్మల్ని చాలా ఒత్తిడికి గురిచేశారు. కేన్ విలియమ్సన్ క్యాచ్‌ను చేజార్చకుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. మా బౌలర్లు పోరాడే స్కోర్ చేయలేదు. అయినా బాగా బౌలింగ్ వేశారు. గత 4-5 ఆటలలో మా ప్రదర్శన బాలేదు' అని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో తమ జట్టు నుంచి దేవ్‌దత్ పడిక్కల్ తనలోని ట్యాలెంట్‌ను నిరూపించుకోవడానికి అవకాశం లభించిదన్నాడు. అతడు టోర్నిలో 400కు పైగా పరుగులు సాధించడాని.. అతి అంత సులభమైనదేమి కాదని చెప్పాడు. అలాగే మహ్మద్ సిరాజ్ మంచి పునరాగమనం లభించిందన్నారు. ఏబీ డివిలియర్స్ ఎప్పటికి జట్టుకు బలంగా నిలిచే ఆటగాడని పేర్కొన్నాడు. మిగతా ఆటగాళ్లు కూడా జట్టు కోసం కష్టపడ్డారని.. కానీ అది సరిపోలేదని చెప్పాడు.

SRH vs RCB: విరాట్ కోహ్లీ ఉన్నన్ని రోజులు బెంగళూరు ఐపీఎల్ కప్ గెలవలేదు!!

Story first published: Saturday, November 7, 2020, 12:26 [IST]
Other articles published on Nov 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X