SRH vs RCB: విరాట్ కోహ్లీ ఉన్నన్ని రోజులు బెంగళూరు ఐపీఎల్ కప్ గెలవలేదు!!

అబుదాబి: ప్రతి సీజన్ మాదిరిగానే 'ఈ సాలా కప్ నమదే' (ఈసారి కప్ మనదే) అంటూ ఐపీఎల్ లీగ్‌లో అడుగుపెట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఆరంభంలో అదరగొట్టినా చివరి దశ కొచ్చేసరికి ఆకట్టుకోలేకపోయింది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన కోహ్లీసేన.. కీలకమైన ఎలిమినేటర్‌లో ఓడి మూల్యం చెల్లించుకుంది. శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమిపాలైంది. పుష్కర కాలంగా బలమైన జట్టుతో బరిలో దిగుతున్న బెంగళూరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ ముద్దాడలేకపోయింది. దీంతో బెంగళూరు ఫాన్స్ మండిపడుతున్నారు.

కోహ్లీ ఉన్నన్ని రోజులు ఆర్‌సీబీ గెలవలేదు:
కరోనా కారణంగా ఈ సారి వేదిక దుబాయ్‌కు మారడంతో తమ తలరాత కూడా మారుతుందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు బలంగా విశ్వసించారు. అయితే నాలుగేళ్ల క్రితం తమను తుది మెట్టుపై బోల్తా కొట్టించిన సన్‌రైజర్స్.. ఈ సారి ఎలిమినేటర్‌లోనే ఇంటిదారి పట్టించింది. దీంతో ఆ జట్టు ఓటమిపై అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. 'విరాట్ కోహ్లీ ఉన్నన్ని రోజులు బెంగళూరు ఐపీఎల్ లీగ్‌లో విజేతగా నిలవలేదని', 'విరాట్ టీమిండియాకు కూడా పెద్ద కప్పులు సాధించలేదు' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

నీ సేవలు చాలు.. ఇక వెళ్లిపో:
గురువారం రాత్రి విరాట్ కోహ్లీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడమే బెంగళూరు పరాజయానికి ప్రధాన కారణమంటూ కొందరు అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆర్‌సీబీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు .#ThankYouVirat, #ThankyouKohli ఇప్పుడీ హ్యాష్ ట్యాగ్ ట్విటర్‌లో దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. 'రిటైర్మెంట్ ప్రకటించినందుకు, ఇన్నేళ్లు టీమిండియాకు చేసి సేవలకు గాను కోహ్లీకి ధన్యవాదాలు' అంటూ నెటిజన్లు ట్వీట్ల మోత మోగిస్తున్నారు. హైదరాబాద్ మ్యాచ్‌లో కొహ్లీ విఫలమైనందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు. 'నీ సేవలు చాలు.. ఇక వెళ్లిపో' అంటూ కోహ్లీని ఆటాడుకుంటున్నారు. అంతేకాదు రకరకాల ఫన్నీ మీమ్స్‌తో జోకులు పేల్చుతున్నారు.

ఓపెనర్‌గా వచ్చినా:
కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కొహ్లీ చెతులెత్తేశాడు. ఈ సీజన్‌లో తొలిసారి బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని.. రెండో స్థానం నుంచి ఓపెనర్‌గా వచ్చిన కొహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రెండో ఓవర్లలోనే ఔట్ అయ్యాడు. 7 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. జాసన్ హోల్డర్ అతడిని బోల్తా కొట్టించాడు. అయితే కీలకమైన మ్యాచ్‌లో కొహ్లీ ఔట్ కావడంతో బెంగళూరు ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.

డివిలియర్స్ రాణించాడు కానీ:
అబుదాబి వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 131/7 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (56) అర్ధ శతకంతో రాణించాడు కానీ లేదంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది. ఛేదనలో హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేన్ విలియమ్సన్ (50), జేసన్ హోల్డర్ (24) రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో వార్నర్‌సేన రెండో క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
వామ్మో.. మళ్లీ బయో బుడగనా!!.. మా వల్ల కాదు: కోహ్లీ