న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పద్మ అవార్డులు: కోహ్లీకి పద్మశ్రీ, సింధుకు మొండిచెయ్యి

2016 సంవత్సరానికి గాను ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, ఉత్తమ సేవలు అందించిన పౌరులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.

By Nageshwara Rao

హైదరాబాద్: 2016 సంవత్సరానికి గాను ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ, ఉత్తమ సేవలు అందించిన పౌరులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. బుధవారం కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేసింది. పద్మ అవార్డుల్లో పలువురు క్రీడాకారులు చోటు దక్కింది.

క్రీడా విభాగం నుంచి ఎనిమిది మంది పద్మ అవార్డులను సొంతం చేసుకున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఒలింపిక్‌ పతక విజేత సాక్షిమాలిక్‌, జిమ్నాస్ట్‌ దీపా కర్మాకర్‌, అథ్లెట్‌ వికాస్‌ గౌడ్‌, హాకీ ఇండియా కెప్టెన్ పీఆర్ శ్రీజేష్‌, పారాలింపిక్స్‌కు చెందిన మరియప్పన్ తంగవేలుకు నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ లభించింది.

Virat Kohli and Sakshi Malik win Padma awards

జిమ్నాస్టిక్స్‌లో దీపా కర్మాకర్‌ తృటిలో పతకం కోల్పోయినా, ఆమె చేసిన అద్భుత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఇక పారాలింపిక్‌ హైజంప్‌ విభాగంలో మరియప్పన్‌ తంగవేలు బంగారు పతకాన్ని సాధించారు. దీంతో వీరికి ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది.

గతేడాది రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పిన సింధును 2015లో పద్మశ్రీ అవార్డు వరించింది. అయితే ఈసారి సింధుకి పద్మ భూషణ్‌ అవార్డు వస్తుందని ఊహించారు. అయితే కేంద్రం ప్రకటించిన జాబితాలో సింధు పేరు లేకపోవడంపై అభిమానులు అసంతృప్తి చెందారు.

Padma Shri Award Winners in Sports category for the year 2017:

1. Virat Kohli (Cricket)
2. Shekar Naik (Blind Cricket)
3. Vikas Gowda (Discus Throw)
4. Deepa Malik (Para Athletics)
5. Mariyappan Thangavelu (Para Athletics)
6. Dipa Karmakar (Gymnastics)
7. PR Sreejesh (Hockey)
8. Sakshi Malik (Wrestling)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X