న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంక క్రికెటర్‌కు క్షమాపణలు చెప్పిన విరాట్ కోహ్లీ (వీడియో)

By Nageshwara Rao
Virat Kohli's return throw hits Sadeera Samarawickrama and what happened next is 'true sportsmanship'

హైదరాబాద్: శ్రీలంక క్రికెటర్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాడు. వివరాల్లోకి వెళితే... ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ తన దూకుడుతో లంక క్రికెటర్‌ సదీరా సమరవిక్రమేను గాయం చేసేంత పని చేశాడు.

అసలేం జరిగిందంటే!
మైదానంలో అటు బ్యాటింగ్‌లోనైనా, ఇటు ఫీల్డింగ్‌లోనైనా కోహ్లీ చురుకుగా ఉంటాడనే సంగతి తెలిసిందే. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా సోమవారం మూడో రోజు ఆటలో టీ విరామం తరువాత ఇన్నింగ్స్‌ 116 ఓవర్‌‌ను అశ్విన్‌ వేశాడు.

అశ్విన్ వేసిన రెండో బంతిని ఎదుర్కొన్న చండీమాల్ మిడాన్ వైపు బాదాడు. ఆ సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ వెంటనే దానిని అందుకున్నాడు. అంతే వేగంగా నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లో ఉన్న సదీరా వైపు విసిరాడు. దాంతో ఆ బంతి సదీరా వెనుకవైపు బలంగా తగిలింది.

అయితే సదేరాకు ఎటువంటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత వెంటనే సదీరా వద్దకు వెళ్లిన కోహ్లీ అతడికి క్షమాపణలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక సైట్‌లో పోస్టు చేసింది.

Story first published: Monday, December 4, 2017, 17:18 [IST]
Other articles published on Dec 4, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X