న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా కోచ్‌గా కోహ్లీ గురువే రానున్నాడా..?

Virat Kohlis childhood coach Rajkumar Sharma shortlisted for India womens coach job

హైదరాబాద్: కొద్ది నెలల ముందే భారత మహిళా క్రికెట్‌ కోచ్ తుషార్ అరోథె రాజీనామా చేశాడు. దీంతో కొత్త కోచ్ కోసం వెదుకులాట మొదలెట్టిన బీసీసీఐ పలు కీలక వ్యక్తుల పేర్లను పరిశీలనలో ఉంచింది. భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్ శర్మ ఎంపికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. మహిళల జట్టు కోచ్‌ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన బీసీసీఐ.. వడపోత అనంతరం ఆరుగురితో షార్ట్‌లిస్ట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ జాబితాలో రాజ్‌కుమార్ శర్మ కూడా ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో కొద్దిరోజుల క్రితం మహిళల జట్టు ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తుషార్ తప్పుకున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీకి క్రికెట్ పాఠాలు నేర్పించిన రాజ్‌కుమార్.. సుదీర్ఘకాలం ఢిల్లీ జూనియర్ టీమ్‌కి కోచ్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఇటీవల ఢిల్లీ రంజీ జట్టు కోచ్‌ పోస్టు కోసం కూడా దరఖాస్తు చేసుకోగా.. ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉంది. ఒకవేళ మహిళల జట్టుకి రాజ్‌కుమార్ కోచ్‌గా ఎంపికైతే.. శ్రీలంక పర్యటన రూపంలో అతనికి కఠిన సవాల్ ఎదురుకానుంది.

జట్టు సభ్యుల ఆరోపణల అనంతరం రాజీనామా చేసిన భారత మహిళల క్రికెట్‌ జట్టు మాజీ కోచ్‌ తుషార్ అరోతె స్థానంలో.. మాజీ టీమ్‌ఇండియా స్పిన్నర్‌ సునీల్‌ జోషి నిలవనున్నాడు. రేసులో నిలిచాడు. భారత్‌ తరఫున 15 టెస్టులు, 69 వన్డేలు ఆడిన జోషికి కోచ్‌గా కూడా అనుభవం ఉంది. అతను అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్‌, ఒమన్‌లతో పాటు దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్‌, జమ్ము కశ్మీర్‌, అసోం జట్లకు కోచ్‌గా పని చేశాడు.

మాజీ ఆఫ్‌స్పిన్నర్‌ రమేశ్‌ పొవార్‌ కూడా కోచ్‌ రేసులో ఉన్నాడు. వీళ్లిద్దరితో పాటు 20 మంది ఈ కోచ్‌ పదవికి దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి శుక్రవారం ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. అజయ్‌ రాత్రా, విజయ్‌ యాదవ్‌, మమతా మాబెన్‌, సుమన్‌శర్మ కూడా జాబితాలో ఉన్నారు. న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ మారియ ఫహె కూడా కోచ్‌ పదవికి దరఖాస్తు చేసింది. మహిళా క్రికెటర్లు కంపర్ట్ జోన్ నుంచి వెలుపలకి వచ్చేందుకు ఇష్టపడటం లేదని రాజీనామా అనంతరం చెప్పుకొచ్చిన తుషార్.. కోచ్‌‌ను మార్చాలని వారు బీసీసీఐని కోరడాన్ని దుయ్యబట్టారు. క్రికెటర్ల నుంచి అలాంటి అభ్యర్థలను బీసీసీఐ ప్రోత్సహించకూడదని అప్పట్లో చెప్పుకొచ్చారు.

Story first published: Tuesday, August 14, 2018, 11:43 [IST]
Other articles published on Aug 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X