న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఫిట్‌నెస్ గురించి ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు చెప్పిన ఎమ్మెస్కే.. విరాట్‌ తర్వాతే రొనాల్డో, మెస్సీ!

Virat Kohli Runs 17 KM During A Good Knock says MSK Prasad

ముంబై: విరాట్‌ కోహ్లీ టీమిండియా ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్. భారత జట్టులో కోహ్లీ ఓ బెంచ్ మార్కును సెట్ చేసాడు. కేవలం తాను మాత్రమే ఫిట్‌గా ఉండకుండా.. జట్టు సభ్యులందరిని ఆ విధంగా తయారుచేస్తున్నాడు. ఇక విరాట్ కెప్టెన్సీ చేపట్టాక టీమిండియాలో ఫిట్‌నెస్‌ పతాక స్థాయికి చేరింది. నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం భారత క్రికెటర్లకి ఉన్న ఫిట్‌నెస్ క్రికెట్ ప్రపంచంలోని మరే జట్టుకీ లేదంటే నమ్మండి. ఫుట్‌బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియెన‌ల్ మెస్సీల కంటే కోహ్లీకే ఫిట్‌నెస్‌ సామ‌ర్థ్యం ఎక్కువగా ఉంటుందట.

<strong>సొంత గడ్డపై ఆడిన తొలి వన్డేలో నేపాల్‌ ఓటమి.. నిరాశలో ఫాన్స్!!</strong>సొంత గడ్డపై ఆడిన తొలి వన్డేలో నేపాల్‌ ఓటమి.. నిరాశలో ఫాన్స్!!

కోహ్లీ తర్వాతే రొనాల్డో, మెస్సీలు

కోహ్లీ తర్వాతే రొనాల్డో, మెస్సీలు

టీమిండియా మాజీ చీఫ్ సెలెక్ట‌ర్ ఎమ్మెస్కే ప్ర‌సాద్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ స్థాయి మరియు ప్రమాణాలను ​​రొనాల్డో మరియు మెస్సీలతో పోల్చాడు. సాధారణంగా ఫుట్‌బాల్, ర‌గ్బీ ఆడే ప్లేయ‌ర్ల‌కు అత్యున్న‌త ఫిట్‌నెస్ ఉండాలి. ఎందుకంటే.. గంట‌ల పాటు మైదానంలో ప‌రుగులు పెడుతూనే ఉండాలి కాబట్టి. రొనాల్డో, మెస్సీ త‌దిత‌ర ఆట‌గాళ్లు ఒక్కో మ్యాచ్‌ల్లో స‌గ‌టున 8 నుంచి 13 కిలోమీట‌ర్లు ప‌రుగెత్తుతార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అయితే కోహ్లీ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడితే.. స‌గటున 17 కిలోమీట‌ర్ల దూరం ప‌రుగెత్తుతాడని ఎమ్మెస్కే అంటున్నాడు.

 17 కిలోమీట‌ర్లు పరుగెడతాడు:

17 కిలోమీట‌ర్లు పరుగెడతాడు:

తాజాగా ఎమ్మెస్కే ప్ర‌సాద్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ స్థాయి గురించి ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు తెలిపాడు. 'క్రికెట్ ఆట టీమ్ స్పోర్ట్స్. ఇందులో ఆట‌గాళ్లు పెద్దగా క‌ష్ట‌ప‌డ‌రు అని చాలామంది భావిస్తుంటారు. ఓ భారీ ఇన్నింగ్స్ ఆడిన క్ర‌మంలో కోహ్లీ స‌గటున 17 కిలోమీట‌ర్ల దూరం ప‌రుగెత్తుతాడు. ఇవి నేను చెపుతున్న గణాంకాలు కావు. టీమిండియా సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న స‌భ్యులకు జీపీఎస్ ట్రాక‌ర్ ఉంటుంది. ఫిట్‌నెస్‌కు సంబంధించి రోజువారి విశేషాలు ఫిట్‌నెస్ ట్రైన‌ర్లు తెలుసుకుంటారు' అని ఎమ్మెస్కే తెలిపాడు.

సిక్స్ ప్యాక్ ఉన్న క్రికెట‌ర్లు చాలామందే:

సిక్స్ ప్యాక్ ఉన్న క్రికెట‌ర్లు చాలామందే:

'భార‌త మాజీ ఫిజియో ట్రైన‌ర్ శంక‌ర్ బ‌సు ఈ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. అన్ని విదేశీ జట్లు కూడా అదే చేస్తున్నాయి. విరాట్ కోహ్లీ జ‌ట్టులోకి వ‌చ్చాక టీమ్ ఫిట్‌నెస్ లెవళ్లు బాగా పెరిగాయి. జట్టు సభ్యులు అందరూ తనలాగే ఉండాలని కోరుకుంటాడు. ప్రస్తుతం జ‌ట్టులో సిక్స్ ప్యాక్ ఉన్న క్రికెట‌ర్లు చాలామందే ఉన్నారు' అని ఎమ్మెస్కే పేర్కొన్నాడు.

ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఎంతో ప్రొఫెషనల్‌:

ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఎంతో ప్రొఫెషనల్‌:

గతంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మేం ఎప్పుడూ ఫుట్‌బాలర్ల క్రమశిక్షణను గమనిస్తుంటాం. ఇది మాకు అవసరం. మైదానంలోకి వెళ్లి ఆడాలంటే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. ఫిట్‌నెస్‌, పోషకాహారం, విశ్రాంతి తదితర అంశాల్లో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారు. మేం వారిని చూసి నేర్చుకుంటాం' అని అన్నాడు.

 కోహ్లీ బెంచ్ మార్కు:

కోహ్లీ బెంచ్ మార్కు:

విరాట్‌ కోహ్లీ తన అమోఘమైన ఫిట్‌నెస్‌తో జట్టు సభ్యుల అందరిలో స్ఫూర్తి నింపుతున్నాడు. విరాట్‌ స్ఫూర్తితో ఇప్పటికే భారత జట్టులోని ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ సిక్స్ ప్యాక్ సాధించారు. యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, మనీశ్ పాండే, శివమ్ దూబేలు కూడా కోహ్లీని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. కోహ్లీ ఎక్కడికి వెళ్లినా.. తన వ్యాయామంను మాత్రం కొనసాగిస్తూనే ఉంటాడు.

Story first published: Thursday, February 6, 2020, 17:48 [IST]
Other articles published on Feb 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X