న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో ఆడాలంటే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం.. నా ఫిట్‌నెస్‌కు ఫుట్‌బాలర్లే ప్రేరణ

Virat Kohli reveals inspiration behind fitness routine in Indian cricketers

హైదరాబాద్: మైదానంలో ఆడాలంటే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. శారీరక దృఢత్వం విషయంలో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారు. నా ఫిట్‌నెస్‌కు ఫుట్‌బాలర్లే ప్రేరణ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. టీమిండియా ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్ విరాట్‌ కోహ్లీ. అతను ఒక బెంచ్ మార్కును సెట్ చేసాడు. తాను మాత్రమే ఫిట్‌గా ఉండకుండా.. జట్టు సభ్యులందరిని ఆ విధంగా తయారుచేస్తున్నాడు. తాజాగా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఫిట్‌నెస్‌ విషయంలో విరాట్ కోహ్లీతో పోటీపడ్డ విషయం తెలిసిందే. విండీస్ పర్యటనలో భాగంగా ఈ ఇద్దరూ షర్ట్ లేకుండా స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేశారు.

IND vs SA: 15 ఏళ్లకే భారత్ తరఫున అరంగేట్రం.. రికార్డుల్లో షఫాలీ వర్మ!!IND vs SA: 15 ఏళ్లకే భారత్ తరఫున అరంగేట్రం.. రికార్డుల్లో షఫాలీ వర్మ!!

ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఎంతో ప్రొఫెషనల్‌:

ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఎంతో ప్రొఫెషనల్‌:

గతంలో కోహ్లీ తన ఆహారం, శిక్షణకు సంబందించిన విషయాలను తెలిపాడు. ప్రస్తుతం క్రికెటర్లపై ఫుట్‌బాల్ క్రీడాకారుల ప్రభావాన్ని వెల్లడించాడు. తాజాగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మేం ఎప్పుడూ ఫుట్‌బాలర్ల క్రమశిక్షణను గమనిస్తుంటాం. ఇది మాకు అవసరం. మైదానంలోకి వెళ్లి ఆడాలంటే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం. ఫిట్‌నెస్‌, పోషకాహారం, విశ్రాంతి తదితర అంశాల్లో ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారు. మేం వారిని చూసి నేర్చుకుంటాం' అని తెలిపాడు.

క్రికెట్‌, ఫుట్‌బాల్‌ను పోల్చలేం:

క్రికెట్‌, ఫుట్‌బాల్‌ను పోల్చలేం:

'క్రికెట్‌, ఫుట్‌బాల్‌ను అస్సలు పోల్చలేం. అయితే ఫాస్ట్ బౌలర్ల శ్రమను మాత్రం పోల్చొచ్చు అని నా అభిప్రాయం. క్రికెట్‌కు అద్భుతమైన శారీరక దృఢత్వం అవసరం లేదు. ఫుట్‌బాల్‌ 90 నిమిషాలే ఆడతారు. పరిస్థితులను నియంత్రించేందుకు సమయం ఉండదు కాబట్టి వారికి శారీరక దృఢత్వం ఉండాలి. అయితే.. పుట్‌బాలర్ల స్థాయిలో దృఢంగా ఉండేందుకు క్రికెటర్లు ప్రయత్నించాలి. అప్పుడే క్రికెట్లో రాణించగలం. క్రికెటర్ల కన్నా ఫుట్‌బాలర్లు ఎక్కువ ఫిట్‌నెస్‌తో ఉంటారు' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

సూపర్ క్యాచ్:

సూపర్ క్యాచ్:

ఈ ఫిట్‌నెస్‌తోనే విరాట్ కోహ్లీ అద్భుతాలు చేస్తున్నాడు. అటు బ్యాటింగ్‌లో పరుగుల వరద పారిస్తూ.. మరోవైపు ఫీల్డింగ్‌లో కూడా కళ్లుచెదిరే క్యాచ్‌లతో ఔరా అనిపిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో కోహ్లీ సూపర్ క్యాచ్ పట్టాడు. ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో పేసర్ నవదీప్ సైనీ వేసిన ఆఫ్‌ కట్టర్‌ను డికాక్‌ భారీ షాట్ ఆడాడు. బంతి కాస్తా గాల్లోకి లేవడంతో మిడాఫ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లీ చిరుతలా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్‌ చేసి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లతో సహా అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. మరోవైపు షాక్ తిన్న డికాక్‌ నిరాశగా పెవిలియన్ చేరాడు.

Story first published: Wednesday, September 25, 2019, 17:21 [IST]
Other articles published on Sep 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X