న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కొత్త సంవత్సర ఆరంభాన్ని నా ఏకైక అనుష్కతో కలిసి.. : కోహ్లీ

Virat Kohli Records Highest International Runs For Third Consecutive Year

సిడ్నీ: విదేశీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో చారిత్రక విజయం సాధించిన భారత్ జట్టును అభినందించేందుకు కోహ్లీ సతీమణి అనుష్క శర్మ అక్కడికి చేరుకుంది. సిరీస్‌లో ఆఖరిదైన నాలుగో టెస్టు సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా మొత్తం అక్కడికి వెళ్లాల్సి ఉంది. ఈ మేర నూతన సంవత్సర వేడుకలను తన సతీమణితో కలిసి సిడ్నీలోనే జరుపుకుంటున్నట్లుు విరాట్ ట్విట్టర్ తెలిపాడు. తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అనుష్కాతో కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేసి దాని కింద 'కొత్త సంవత్సర ఆరంభాన్ని నా ఏకైక అనుష్కతో కలిసి జరుపుకోబోతున్నాను' అని పేర్కొన్నాడు.

37 ఏళ్ల విరామం తర్వాత ఎంసీజీలో

మూడో టెస్టులో 137 పరుగుల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సంపాదించింది. 37 ఏళ్ల విరామం తర్వాత ఎంసీజీలో నెగ్గిన భారత్‌కు మొత్తంగా ఇది 150 టెస్టు విజయం కావడం విశేషం. ఐదో రోజు ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను ముగించడానికి భారత్‌ పెద్దగా శ్రమపడలేదు. మిగిలిన ఆ రెండు వికెట్లను 27 బంతుల్లోనే పడగొట్టింది. ఓవర్‌నైట్‌ స్కోరు 258/8తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌.. 261 పరుగులకు ఆలౌటైంది. కమిన్స్‌ (63) వీరోచిత పోరాటానికి బుమ్రా తెరదించాడు. కమిన్స్‌ తొలి స్లిప్‌లో పుజారా చేతికి చిక్కగా.. తర్వాతి ఓవర్లోనే లైయన్‌ (7)ను ఇషాంత్‌ ఔట్‌ చేశాడు.

399 పరుగుల లక్ష్య ఛేదనలో

399 పరుగుల లక్ష్య ఛేదనలో

బుధవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు చతేశ్వర్ పుజారా (106) 319 బంతుల్లో సెంచరీ సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌ని 443/7తో డిక్లేర్ చేయగా.. అనంతరం ఆస్ట్రేలియా టీమ్‌ 151 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. దీంతో.. 292 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌‌ని 106/8తో డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 399 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పాట్ కమిన్స్ (63) మినహా అందరూ తేలిపోయారు.

ఆసీస్‌ను కట్టడి చేస్తే సిరీస్ చేజిక్కినట్లే

ఆసీస్‌ను కట్టడి చేస్తే సిరీస్ చేజిక్కినట్లే

ఇప్పటికే మ్యాచ్ విజయం సాధించి ఆధిక్యంతో ఉన్న టీమిండియా నాలుగో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ ఆఖరి టెస్టు సిడ్నీ వేదికగా జరగనుంది. ఇందులో ఆసీస్‌ను కట్టడి చేస్తే సిరీస్ చేజిక్కినట్లే. అడిలైడ్ వేదికగా, మెల్‌బౌర్న్ వేదికగా టీమిండియా గెలవగా, పెర్త్ స్టేడియంలో మాత్రం టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Story first published: Monday, December 31, 2018, 19:07 [IST]
Other articles published on Dec 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X