న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Test rankings: స్మిత్ చెత్త ప్రదర్శనతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న కోహ్లీ

ICC Test Rankings : Virat Kohli Reclaims Top Spot From Steve Smith || Oneindia Telugu
Virat Kohli reclaims No.1 Test rank after Steve Smiths poor run vs Pakistan

హైదరాబాద్: ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను విరాట్ కోహ్లీ వెనక్కినెట్టాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇటీవలే బంగ్లాదేశ్‌తో ముగిసిన డే నైట్ టెస్టులో కోహ్లీ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.

సొంతగడ్డపై సఫారీలతో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ... ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో సైతం సెంచరీ సాధించాడు. అదే సమయంలో పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో స్టీవ్ స్మిత్(4, 36) పరుగులతో నిరాశ పరిచాడు. దీంతో స్మిత్‌ను వెనక్కి నెట్టి కోహ్లీ No.1 స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఎమ్మెస్కే గడువు పూర్తి.. చీఫ్​ సెలెక్టర్​గా శివరామ కృష్ణన్​?ఎమ్మెస్కే గడువు పూర్తి.. చీఫ్​ సెలెక్టర్​గా శివరామ కృష్ణన్​?

అగ్రస్థానంలో కోహ్లీ

అగ్రస్థానంలో కోహ్లీ

అగ్రస్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ(928)కి స్టీవ్ స్మిత్(923)కు మధ్య ఐదు పాయింట్ల వ్యత్యాసమే ఉండటం విశేషం. 2019లో టీమిండియా టెస్టు క్యాలెండర్ ముగిసింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ భారత్ తరుపున 84 టెస్టులాడి 7202 పరుగులు సాధించాడు. ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి.

పాక్‌తో సిరిస్‌లో నిరాశపరిచిన స్మిత్

పాక్‌తో సిరిస్‌లో నిరాశపరిచిన స్మిత్

ఇక, స్టీవ్ స్మిత్ విషయానికి వస్తే 70 టెస్టులాడి 7013 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు ఉన్నాయి. డిసెంబర్ 12 నుంచి ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌లో రెండు టెస్టులు ఈ నెలలో జరగనుండటంతో కోహ్లీ నెంబర్ ర్యాంకుని స్మిత్ అధిగమించే అవకాశం ఉంది.

12 స్థానాలు ఎగబాకిన డేవిడ్ వార్నర్

12 స్థానాలు ఎగబాకిన డేవిడ్ వార్నర్

పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 12 స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు రెండు టెస్టుల్లో సెంచరీలతో చెలరిగిన మార్నస్ లాబుస్‌ఛేంజ్ ఐసీసీ ర్యాంకుల్లో 8వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 110వ ర్యాంకుతో ఈ ఏడాదిని మార్నస్ ఆరంభించాడు.

టాప్-10లో ముగ్గురు భారత బ్యాట్స్‌మన్

టాప్-10లో ముగ్గురు భారత బ్యాట్స్‌మన్

మరోవైపు టీమిండియా వైస్ కెప్టెన్ అజ్యంకె రహానే ఒక స్థానం దిగజారి ఆరో స్థానంలో నిలిచాడు. ఐసీసీ ర్యాంకుల్లో టాప్-10లో భారత్ నుంచి ముగ్గురు బ్యాట్స్ మెన్లు ఉన్నారు. కెప్టెన్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవగా... ఛటేశ్వర్ పుజారా 4వ స్థానంలో... రహానే 6వ స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10 బ్యాట్స్‌మన్

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10 బ్యాట్స్‌మన్

1. విరాట్ కోహ్లీ - 928 (పాయింట్లు)

2. స్టీవ్ స్మిత్ - 923

3. కేన్ విలియమ్సన్ - 877

4. చేతేశ్వర్ పూజారా - 791

5. డేవిడ్ వార్నర్ - 764

6. అజింక్య రహానె - 759

7. జో రూట్ - 752

8. మార్నస్ లాబుస్చాగ్నే 731

9. హెన్రీ నికోల్స్ - 726

10. దిముత్ కరుణరత్నే - 723

Story first published: Wednesday, December 4, 2019, 15:06 [IST]
Other articles published on Dec 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X