న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆహా! ఏమా అద్భుత విజయం.. టెస్ట్ క్రికెట్‌లో టాప్ ప్రదర్శన: కోహ్లీ

Virat Kohli Reacts To West Indies Brilliant Win Over England

హైదరాబాద్: కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల తర్వాత జరిగిన తొలి బయోబబుల్‌ టెస్టు‌ విజయవంతం అయింది. సౌతాంప్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లో విండీస్‌దే పైచేయి అయ్యింది. ఆదివారం ముగిసిన మొదటి టెస్టులో విండీస్‌ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. యువ ఆటగాడు జెర్నేన్ బ్లాక్‌వుడ్‌ (95; 12 ఫోర్లు) అదరగొట్టడంతో.. 200 పరుగుల లక్ష్యాన్ని విండీస్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

టెస్ట్ క్రికెట్‌ టాప్ ప్రదర్శన

అద్భుత విజ‌యం సాధించిన వెస్టిండీస్‌ జట్టుపై ప్ర‌శంస‌లు జల్లు కురుస్తున్న‌ది. క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు విండీస్ ప్లేయ‌ర్ల‌ను పొగుడుతూ ట్వీట్ చేశారు. 'వావ్.. విండీస్ క్రికెటర్లు అద్భుత విజయం సాధించారు. టెస్ట్ క్రికెట్‌ టాప్ ప్రదర్శన' అని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. 'రెండు జ‌ట్ల ప్లేయ‌ర్లు అద్భుత‌మైన ఆట‌ను ప్ర‌ద‌ర్శించారు. అత్యంత కీల‌క‌మైన ద‌శ‌లో బ్లాక్‌వుడ్ ఉత్కంఠబ‌రిత‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ గెలుపుతో సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారింది' అని సచిన్ ట్వీటారు.

బ్లాక్‌వుడ్‌పై మీమ్స్

బ్లాక్‌వుడ్‌పై మీమ్స్

ఓటమి దిశగా పయనిస్తున్న జట్టుని ఒంటిచేత్తో బ్లాక్‌వుడ్ విజయతీరాలకి చేర్చాడు. 27/3తో పీకల్లోతు కష్టాల్లో పడిన విండీస్ జట్టును క్రీజులోకి వచ్చిన బ్లాక్‌వుడ్ (95: 154 బంతుల్లో 12x4) అసాధారణ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో బ్లాక్‌వుడ్ కెప్టెన్ జేసన్ హోల్డర్‌ వద్ద సలహాలు తీసుకుంటూ కనిపించాడు. బ్లాక్‌వుడ్ పొట్టిగా ఉండడంతో.. ఆ సమయంలో హోల్డర్ భుజాలపైకి కూడా కనిపించలేదు. దాంతో నెటిజన్లు ఫన్నీగా బ్లాక్‌వుడ్‌పై మీమ్స్, జోక్‌లు పేల్చుతున్నారు. పొట్టివాడైనా.. తన పోరాట పటిమతో గట్టివాడిగా నిరూపించున్నాడని సెటైర్లు వేస్తున్నారు.

హోల్డర్‌ సిక్సర్

హోల్డర్‌ సిక్సర్

వర్షం దోబూచులాడిన మొదటి టెస్టులో ఇంగ్లండ్‌ టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 204 పరుగులకే ఆలౌటైంది. విండీస్‌ బౌలర్లలో హోల్డర్‌ 6, గాబ్రియేల్‌ 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం వెస్టిండీస్‌ 318 పరుగులు చేసి 114 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని సాధించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 4, అండర్సన్‌ 3, బెస్‌ 2, మార్క్‌ వుడ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

చెలరేగిన బ్లాక్‌వుడ్‌:

చెలరేగిన బ్లాక్‌వుడ్‌:

114 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బర్న్స్‌ (42), సిబ్లీ (50) శుభారంభం ఇచ్చారు. డెన్లీ 29, జాక్‌ 79, స్టోక్స్‌ 46, ఆర్చర్‌ 23, పోప్‌ 12 పరుగులు చేశారు. అయితే విండీస్‌ బౌలర్లు రాణించడంతో ఇంగ్లాండ్‌ వెనువెంటనే వికెట్లను కోల్పోయింది. కేవలం 60 పరుగులకే ఆఖరి ఆరు వికెట్లను కోల్పోయింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 313 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆలౌటై.. విండీస్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గాబ్రియేల్‌ 5, జోసెఫ్‌ 2, ఛేజ్ 2, హోల్డర్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఆపై లక్ష్య ఛేదనలో బ్లాక్‌వుడ్‌ చెలరేగడంతో విండీస్ సునాయాస విజయాన్ని అందుకుంది.

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల ఖాతా తెరిచిన విండీస్.. టాప్‌లో భారత్!!

Story first published: Monday, July 13, 2020, 16:37 [IST]
Other articles published on Jul 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X